Cooking Gas: వంటగ్యాస్‌ తీసుకునేప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

సిలిండర్‌పై కొన్ని సింబల్స్‌ ఉంటాయి. వాటిని గ‌మ‌నించ‌క‌పోతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పదేళ్లకు ఒకసారి సంస్థలు గ్యాస్‌ సిలిండర్‌ను రీప్లేస్‌ చేసే సమయంలో దానిమీద ఒక కోడ్‌రూపంలో రాస్తుంటారు. ఆ కోడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Cooking Gas: వంటగ్యాస్‌ తీసుకునేప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
New Update

Cooking Gas: వంటగ్యాస్‌ అనేది ఇంట్లో ఒక భాగం అయిపోయింది. గ్యాస్‌ అయిపోయిందంటే ఇంట్లో పస్తులే. గ్యాస్‌ అయిపోగానే వెంటనే గ్యాస్‌ బుక్‌ చేస్తుంటాం. అయితే సిలిండర్‌పై కొన్ని సింబల్స్‌ ఉంటాయి వాటిని మాత్రం అస్సలు గుర్తించం. ఇలా గ‌మ‌నించ‌క‌పోతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న మాట. గ్యాస్ సిలిండ‌ర్‌పై ఒక కోడ్ ఉంటుంది. దీన్ని చాలా మంది గమనించరు. అసలు అదేంటో కూడా తెలియదు.

publive-image

గ్యాస్‌ సిలిండర్‌లో గ్యాస్‌ ద్రవ రూపంలో ఉంటుంది. సిలిండ‌ర్‌ను మందపాటి లోహంతో తయారు చేస్తారు. అందుకే లోపల ఎంత పీడనం ఉన్నా సిలిండర్‌ పేలుడుకు గురికాదు. అయితే ఎక్కువ రోజులు వాడితే సిలిండర్‌ తుప్పురావడం, రెగ్యులేటర్‌ పెట్టే దగ్గర కొన్ని పగుళ్లు ఉంటాయి. అందుకే పదేళ్లకు ఒకసారి సంస్థలు గ్యాస్‌ సిలిండర్‌ను రీప్లేస్‌ చేయడం లేదా సర్వీసింగ్‌ చేయడం చేస్తుంటాయి. తర్వాత సర్వీసింగ్‌ ఎప్పుడో దానిమీద ఒక కోడ్‌రూపంలో రాస్తుంటారు. సిలిండర్‌ను పరీక్షించి చూస్తే ఎ,బీ,సీ,డీల రూపంలో రాసి ఉంటుంది. దాని పక్కన రెండు అంకెలు కూడా రాసి ఉంటాయి.

publive-image

ఆ సంఖ్య ప్రస్తుత శ‌తాబ్దంలోని సంఖ్య అని అర్థం. ఒకవేళ 24 అని ఉంటే అది 2024 సంవత్సరానికి చెందిన సిలిండర్‌ అని అర్థం. నెంబర్‌కు ముందు ఏ ఉంటే అది జనవరి- మార్చి మధ్య తయారైందని అర్థం. బీ అని ఉంటే ఏప్రిల్‌-జూన్‌ వరకు తయారైంది. సి అని ఉంటే జులై-సెప్టెంబర్‌, డి అని ఉంటే అక్టోబర్‌-డిసెంబర్‌ అని అర్థం. మన దగ్గర సిలిండర్‌పై 24 డి అని ఉంటే దాన్ని 2028లో సర్వీసింగ్‌కు పంపాలి. అలా పంపించకపోతే లోపాలు బయటపడతాయి. అందుకే గ్యాస్‌ తీసుకునేటప్పుడు వీటిని పరీక్షించిన తర్వాత తీసుకోవాలి. లేకుంటే అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మూత్రపిండాల ఆరోగ్యం కళ్లలో కూడా తెలుస్తుందా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#cooking-gas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe