Moneyplant: శుక్రవారం మనీప్లాంట్‌ దగ్గర ఇవి ఉంచితే డబ్బే డబ్బు

శుక్రవారం రోజున మనీప్లాంట్ దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. తర్వాత మనీప్లాంట్ మొక్కలో పాలు పోయాలి. ఇలా చేస్తే వారంలోపు ఆర్థిక సమస్యలు తగ్గటంతోపాటు.. ఇల్లు ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. ఇంట్లో దోషాన్ని తగ్గిస్తుంది.

New Update
Moneyplant: శుక్రవారం మనీప్లాంట్‌ దగ్గర ఇవి ఉంచితే డబ్బే డబ్బు

Moneyplant: మనీప్లాంట్‌ మొక్క పెరిగేకొద్దీ సంపదలూ పెరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది. మనీ మీద మమకారంతో ఇంట్లో, ఆఫీస్‌లో మనీప్లాంట్‌ పెంచుకుంటారు. అయితే..ఈ కాసుల మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెంచడం అశుభమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తారు. కొందరికి ఎంత కష్టపడినా డబ్బు ఇంట్లో నిల్వ ఉండదు. ఎంత కష్టపడి పని చేసినా సమయం కలిసి రాక..వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటివి జరుగుతుంటే.. కుండలి దోషం వల్లనో, వాస్తు దోషం వల్లనో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. డబ్బు సమస్యలు తీరలంటే ఆ వాస్తు చిట్కా గురించి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆర్థిక సమస్యలు తగ్గుతాయి:

  • ప్రతి ఇంట్లో తులసి చెట్టు, పూల చెట్లు, మనీ ప్లాంట్లు కనిపిస్తుంది. అయితే.. శుక్రవారం రోజున మనీప్లాంట్ దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టి, లక్ష్మీదేవిని పూజించాలి. తర్వాత మనీప్లాంట్ మొక్కలో పాలు పోయాలి. ఇలా చేస్తే వారంలోపు ఆర్థిక సమస్యలు తగ్గటంతోపాటు.. ఇల్లు ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. ఇంట్లో దోషాన్ని తగ్గుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేటప్పుడు సరైన దిశలో ఉందో..? లేదో చూసుకోవటం చాలా ముఖ్యం. మీకు తెలియకుండా వేరే దిశలో ఈ ప్లాంట్ ఉంటే..దాని ప్రభావం మీ మీద చూపిస్తుందని గుర్తుచ్చుకోవాలి.

ఉచితంగా తీసుకుంటే మంచిది కాదు:

  • మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశ,ఉత్తరం దిశలో ఉంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. నరదిష్టి ఉన్న వారు ఈ చిట్కా ను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే మనీ ప్లాంట్‌ను మాత్రం ఈశాన్యంలో ఉంటే రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక సమస్యలు వస్తయని నిపుణులు హెచ్చరిస్తారు . అదే ఆగ్నేయ దిశలో పెంచితే కుజ, శుక్ర గ్రహాల అనుగ్రహంతో ఆదాయం పెరిగి రుణబాధలూ తగ్గుతాయంటారు. మనీప్లాంట్‌ను నర్సరీ నుంచి కొని తెచ్చుకుంటే మంచిది. ఉచితంగా తీసుకున్న, ఇతరులకు ఇచ్చినా మంచిది కాదు. ఇలా చేస్తే ఇచ్చేవారి అదృష్టం, తీసుకునేవారికి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు.

ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా?..వీటిని అస్సలు తినకండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు