Hakimpet sports school: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో కీచక పర్వం..బాలికలపై లైంగిక వేధింపులు..త్వరలోనే అధికారిపై వేటుకు రంగం సిద్ధం!

జ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజర్లను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ రెజర్లు చేసిన ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కొన్ని నెలల పాటు మహిళా రెజర్లు చేసిన పోరాటానికి దేశరాజధాని దద్దరిల్లింది.  చివరికి కేంద్రం దిగి రావడంతో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ విషయం మర్చిపోక ముందే మన రాష్ట్రంలోని  హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ లో మరో కీచక పర్వం బయటపడింది..

New Update
Hakimpet sports school: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో కీచక పర్వం..బాలికలపై లైంగిక వేధింపులు..త్వరలోనే అధికారిపై వేటుకు రంగం సిద్ధం!

Hakimpet sports school:రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజర్లను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ రెజర్లు చేసిన ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కొన్ని నెలల పాటు మహిళా రెజర్లు చేసిన పోరాటానికి దేశరాజధాని దద్దరిల్లింది.  చివరికి కేంద్రం దిగి రావడంతో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ విషయం మర్చిపోక ముందే మన రాష్ట్రంలోని  హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ లో మరో కీచక పర్వం బయటపడింది. రాత్రి పూట స్పోర్ట్స్ స్కూల్ లోని బాలికల హాస్టల్ లోకి చొరబడుతున్న ఓ అధికారి బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీనికి సంబంధించి మీడియాలో వరుసగా కథనాలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రియాక్ట్ అవుతూ.. తనను ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇక దీనిపై తెలంగాణ స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పై సస్పెన్షన్ వేటు వేస్తామని.. ఈ విషయంపై పూర్తిగా విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఎమ్మెల్సీ కవితకు ట్విట్టర్ వేదికగా తెలియపర్చారు.

నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి హాస్టల్ లోకి..

నిబంధనలకు విరుద్ధంగా సదరు అధికారి బాలికల హాస్టల్ లోకి అర్థరాత్రి వచ్చేవాడని.. లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా స్పోర్ట్స్ స్కూల్ లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో కూడా ఆ అధికారికి సంబంధాలున్నాయని.. ఆమెతో హాస్టల్ లోనే రాసలీలలు నడుపుతున్నాడునే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.

సాయంత్రం పూట స్పోర్ట్స్ స్కూల్ లో ఉండే బాలికలను కారులో బయటికని తీసుకొని వెళ్లేవాడని కూడా బాధిత బాలికలు చెబుతున్నారు. దీంతో స్కూల్ లో ఉన్న విద్యార్థినులు ఆ అధికారి లైంగిక వేధింపులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే మీడియాలో వచ్చిన కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని.. ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు