కేదార్నాథ్ యాత్ర నిలిపివేత...అప్పటివరకు అనుమతి లేదు..? ఉత్తరఖాండ్లో కేదార్నాథ్కు ప్రతిఏటా లక్షలాది మంది తరలివస్తుంటారు. శివలింగాన్నిదర్శించుకునేందుకు బారులు తీరుతుంటారు. అయితే ఈ ఏడాది కూడా కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కేదార్ నాథ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న యాత్రను తాత్కలికంగా నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చేంత వరకు యాత్రకు వచ్చేవారని ఎవర్నీ కూడా అనుమితించరాదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. By Bhoomi 26 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి కేదార్ నాథ్ యాత్ర....ఈ యాత్రకు దేశం నలుమూల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రతిఏటా కేదార్ నాథ్ యాత్రను దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా కేదార్ నాథ్ యాత్ర ఈ మధ్యే ప్రారంభమైంది. అయితే అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితుల ద్రుష్ట్యా సీఎం పుష్కర్ సింగ్ దామీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ యాత్రను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారు. రాబోయే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఉత్తర్వులు జారీ చేసేంతవరకు యాత్రకు వచ్చేవారిని ఎవర్నీ కూడా అనుమతించకూడదని పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే యాత్రకు బయలుదేరిని యాత్రికులను సోన్ ప్రయాగ ప్రాంతం వద్ద అధికారులు అడ్డుకున్నారు. వారు అక్కడే ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు. కేవలం కేదార్ నాథ్, రుద్రప్రయాగ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతోపాటు వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెస్క్యూటీం, పోలీసులు వర్షాలు పడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి