సూర్యాపేట నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. గతంలో కంటే ఇంకా ఐదు, ఆరు సీట్లు ఎక్కువే గెలుస్తాం

సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం కేసీఆర్‌. ఇచ్చిన మాట తప్పలేదు.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్‌ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్‌. ఇక పింఛన్లు తప్పకుండా పెంచుతామని స్పష్టం చేశారు.

సూర్యాపేట నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. గతంలో కంటే ఇంకా ఐదు, ఆరు సీట్లు ఎక్కువే గెలుస్తాం
New Update

సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం కేసీఆర్‌. రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్‌. అభివృద్ధిలో తెలంగాణనే నెంబర్‌ వన్ అన్నారు సీఎం కేసీఆర్‌. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇస్తున్నామని చెప్పారు. తలసరి ఆదాయంలోనూ మనమే నెంబర్ వన్‌లో ఉన్నామని.. సూర్యాపేటలో అద్భుతమైన కళాభారతిని నిర్మిస్తామని హామి ఇచ్చారు కేసీఆర్. సీఎం నిధి నుంచి గ్రామ పంచాయతీలకు పది లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. 25 కోట్లతో సూర్యాపేటకు కళాభారతి.. మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్‌ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. ఆర్‌ అండ్ బీ గెస్ట్ హౌస్ మంజూరు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు కేసీఆర్‌.

సీఎం కేసీఆర్‌ ఇంకా ఏం అన్నారంటే:
➼ సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం.

➼ జగదీష్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలంటూ కేసీఆర్ పిలుపు.

➼ ఎలక్షన్లు వస్తున్నాయని విపక్షాలు మళ్లీ డ్రామాలు మొదలుపెట్టాయి.

➼ ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటే మరొకడు మూడు గంటల కరెంటే అంటున్నాడు.

➼ ధరణి తీసేస్తే రైతులకు బీమా ఎలా వస్తుంది?

➼ మళ్లీ మనకు పాత రోజులు రావాలా?

➼ అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.

➼ విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దు

➼ మోసపోతే మళ్లీ గోస పడుతాం

➼మళ్లీ BRS గెలువబోతోంది... ఇందులో డౌట్ లేదు

➼ గతంలో కంటే ఇంకా ఐదు, ఆరు సీట్లు ఎక్కువే గెలుస్తాం

➼రూ.37వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మనది

పెన్షన్ల పెంపుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.4వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని.. వారు రూల్‌ చేస్తున్న రాష్ట్రాల్లో రూ.4వేలు పింఛను ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రానికో విధానం ఉంటుందా అని నిలదీశారు కేసీఆర్‌. పింఛన్లు తప్పకుండా పెంచుతామని స్పష్టం చేశారు కేసీఆర్. కాంగ్రెస్‌ కానీ బీజేపీ కానీ ఎన్నడైనా నల్లగొండలో, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేశారు. రైతులు చనిపోతుంటే, కనీస మద్దతు ధర ఇచ్చారా అని మండిపడ్డ కేసీఆర్‌.. కళ్యాణ లక్ష్మీణి, పెన్షన్‌ను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నామన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పెన్షన్‌ పెంచే ఆలోచన ఎప్పుడైనా చేసిందా అని బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు కేసీఆర్.

#cm-kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe