Etala:కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడానికి కారణమిదే: ఈటల

కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారని..మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రజలు భయపడుతున్నారని బీజేపీ నేత ఈటల అన్నారు. ఇక ప్రజల సంకల్పాన్ని గౌరవించాల్సిన బాధ్యత బీజేపీ పై ఉందన్నారు. కేసీఆర్ అహంకారాన్ని తొక్కి నన్ను గెలిపించారన్నారు ఈటల. దుబ్బాక,ghmc, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలిచిందన్నారు.

New Update
Etala:కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడానికి కారణమిదే: ఈటల

Etala:కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారని..మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రజలు భయపడుతున్నారని బీజేపీ నేత ఈటల అన్నారు. ఇక ప్రజల సంకల్పాన్ని గౌరవించాల్సిన బాధ్యత బీజేపీ పై ఉందన్నారు. కేసీఆర్ అహంకారాన్ని తొక్కి నన్ను గెలిపించారన్నారు ఈటల. దుబ్బాక,ghmc, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలిచిందన్నారు.

ఇక నాలుగేళ్ళలో ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేదన్నారు.కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కి తప్ప మరో పార్టీకి లేదన్నారు ఈటల.4,5 నెలలుగా బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన విమర్శించారు. ఈ దేశం మోడీ పాలనలో తప్ప ఎవరి చేతుల్లో క్షేమంగా ఉండదన్నారు.ఇక 27 న మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా సభ ఉంటుందని..రెండు సార్లు వాయిదా పడిందని.. ఖమ్మం జిల్లా ప్రజలు దయచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈటల.

గర్భవతులను  కూడా బూటు కాళ్లతో తన్నిన ఘటనలు ఈ జిల్లాలో అనేకమున్నాయన్నారు ఈటల. ఖమ్మం జిల్లా మార్పుకు నాంది పలికే జిల్లా అన్నారు. కేసీఆర్ కు పేదా ధనికకు  తేడా తెల్వదన్నారు. ఇక దేశానికి తెలంగాణ ఆదర్శం కాబోతోందని కేసీఆర్ మహారాష్ట్ర పోయి  అంటున్నాడని..మన సొమ్ము తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నారు..ఇక్కడి రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని ఈటల విమర్శలు గుప్పించారు.

రైతుకు భరోసానిచ్చే సభ రేపు జరగబోతుందన్నారు. మా మదిలో చాలా పథకాలున్నాయి వాటిని ప్రకటించబోతున్నామన్నారు. పేరుకు కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలో పుట్టాను అంటున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్యూడల్ గా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించారని ఈటల విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు