Asaduddin Owaisi:థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కే ఉంది: అసదుద్దీన్ ఓవైసీ

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పై ముమ్మరంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే గతంలో అనేక సార్లు కేసీఆర్ కు చేసిన రిక్వెస్టే మరోసారి చేస్తున్నానని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

New Update
Asaduddin Owaisi:థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కే ఉంది: అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi:ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పై ముమ్మరంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే గతంలో అనేక సార్లు కేసీఆర్ కు చేసిన రిక్వెస్టే మరోసారి చేస్తున్నానని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

కేసీఆర్ ఈ సారి చొరవ తీసుకోవల్సిందే..!

అయితే దేశంలో థర్డ్ ఫ్రంట్ రావాలని కోరుకుంటున్న ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాని కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఇక ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సత్తా ఓన్లీ కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు ఒవైసీ.

కాగా, ఆయనతో కలిసేందుకు దేశంలో అనేక పార్టీలు రెడీగా ఉన్నాయన్నారు. కాబట్టి కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనేక సార్లు తాను విన్నవించానని అసదుద్దీన్ తెలిపారు.

దూకుడు పెంచుతున్న ఇండియా కూటమి..!

ఇక ఇలా ఉంటే..రానున్న ఎన్నికల్లో కమలనాథులను గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇండియా కూటమిగా ఏర్పడి దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే రెండు సమావేశాలను నిర్వహించిన ఇండియా కూటమి మరోసారి ముంబైలో భేటీకి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. కేసీఆర్ ముందు నుంచి ప్లాన్ చేసిన విధంగా థర్డ్ ఫ్రంట్ తో ముందుకు వస్తే.. తప్పకుండా బీజేపీని గద్దె దింపొచ్చని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు