రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి పలు సంక్షేమపథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వరకు అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా రేషన్ డీలర్ల కమీషన్ ను డబుల్ చేస్తూ.. 70 రూపాయల నుంచి 140 కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్!
New Update

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి పలు సంక్షేమపథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వరకు అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి.

ఇక తాజాగా.. ఎప్పట్నుంచో కమీషన్ విషయంలో పోరాటం చేస్తున్న రేషన్ డీలర్లకు సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్ ను డబుల్ చేస్తూ.. 70 రూపాయల నుంచి 140 కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం  సెక్రటేరియట్ లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్... రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే గత కొన్నాళ్లుగా రేషన్ డీలర్లకు భద్రత కావాలని.. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ స్థానంలో వయస్సుతో సంబంధం లేకుండా గౌరవ వేతనం ఇవ్వాలని పోరాటం చేస్తూ వస్తున్నారు రేషన్ డీలర్లు.

21 డిమాండ్లతో ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్ల పాత్ర కీలకమని... రైస్ మిల్లర్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని.. రేషన్ డీలర్లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జూన్ 5 తరువాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయితే అప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామి హామీ ఇవ్వడంతో వారు వెనుదిగారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి