TS Politics: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి నేనే.. ఆర్టీవీతో తాటికొండ రాజయ్య! వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను బరిలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పిలుపుతో రాజయ్య ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత రాజయ్య పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. By Nikhil 12 Apr 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వరంగల్ బీఆర్ఎస్ (BRS) ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) పేరును ఫైనల్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ మేరకు రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లినట్లు సమాచారం. దీంతో రాజయ్య కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు ఫామ్ హౌజ్ కు బయలుదేరారు. మరికాసేపట్లో కేసీఆర్ తో రాజయ్య భేటీ కానున్నారు. అనంతరం రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. తనకు టికెట్ కన్ఫామ్ అయ్యిందని రాజయ్య ఆర్టీవీకి తెలిపారు. ఇది కూడా చదవండి: రేవంత్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు: మందకృష్ణ ఫైర్ అసెంబ్లీ ఎన్నికల్లో దక్కని అవకాశం.. గత ఎన్నికల సమయంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ఆ సమయంలో రాజయ్యకు వరంగల్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజయ్య పార్టీ వీడారు. కాంగ్రెస్ లో ఆయన చేరిక ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. ఏమైందో తెలియదు కానీ ఆయన చేరికకు బ్రేక్ పడింది. మాదిగ సామాజిక వర్గంలో పట్టు.. రాజయ్య ప్రత్యర్థి కడియం శ్రీహరి మాత్రం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన కూతురికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కూడా దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గరయ్యారన్న ప్రచారం సాగుతోంది. మాదిగ సామాజిక వర్గంలో పట్టు ఉన్న రాజయ్య ను అభ్యర్థిగా బరిలోకి దించే తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ కారుడిగా, వైద్యుడిగా ఆయనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే రాజయ్య పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. #tatikonda-rajaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి