Video: చూస్తే కన్నీళ్లు ఆగవు.. సాయిచంద్ భార్యను హత్తుకొని ఏడ్చేసిన కవిత ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గాయకుడు సాయిచంద్ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సాయిచంద్ చిన్నవయసులోనే వెళ్లిపోయాడని రోదిస్తున్న ఆయన భార్య రజనీని కవిత హత్తుకొని ఓదార్చే ప్రయత్నంలో ఏడుపును ఆపుకోలేకపోయారు. By Trinath 06 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి గుండె బరువెక్కింది..తెలంగాణ ఉద్యమ గొంతుక సాయిచంద్ మరణం తర్వాత ఆయన భార్య రజని ఏడ్చిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాలను కన్నీరుపెట్టించగా..తాజాగా సాయిచంద్ భార్యను ఓదార్చడానికి వెళ్లిన కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రజనిని హత్తుకొని కవిత ఏడ్చేశారు. రజని, కవిత ఇద్దరూ సాయిచంద్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలను అక్కడే ఉండి చూసిన వాళ్లు కళ్లు చమర్చాయి. సాయిచంద్ మరణం తర్వాత సరిగ్గా తినక ఇటివలే ఆస్పత్రిపాలైన రజనిని ఓదార్చడానికి వచ్చిన కవిత కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కేసీఆర్, హరీశ్‌రావుకు అత్యంత ఆప్తుడు సాయిచంద్. బీఆర్ఎస్ ఏ సభ నిర్వహించినా అందులో ఎంతో ఉత్సాహంగా ఆడి, పాడే సాయిచంద్ కళ్ల ముందు లేడన్న బాధ సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు వరకు ప్రతిఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది. రజనిని ఓదార్చుతున్న కవిత జీర్ణించుకోలేకపోతున్న రజని: 39ఏళ్ల సాయిచంద్ తక్కువ వయసులోనే గుండెపోటుతో ఈ లోకాన్ని వీడడాన్ని ఆయనంటే ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సాయిచంద్‌ని ప్రేమించి..పెళ్లి చేసుకున్న ఆయన భార్య రజని గుండె పగిలేలా రోదిస్తున్నారు. కొద్ది రోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తిండి తినక అలానే ఏడుస్తున్న రజని రెండు రోజుల క్రితం గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా.. భర్త లేడన్న చేదు నిజాన్ని మాత్రం అంగీకరించలేపోతున్నారు. ఓవైపు అమ్మా నాన్నెక్కడ అని తన కూతురు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక.. మరోవైపు నాన్న మళ్లి రాడన్న విషయాన్ని అర్థం చేసుకున్న సాయిచంద్ కొడుకు తన తండ్రి షర్ట్‌ని తన పక్కనే పెట్టుకొని...దాన్ని హత్తుకొని పొడుకుంటుంటే ఆ తల్లి గుండె ఎంత విలవిలలాడుతుందో అర్థం చేసుకోవచ్చు. రజనిని ఓదార్చే క్రమంలో ఏడ్చేసిన కవిత ఇద్దరిని కలిపిన ఉద్యమం: సాయిచంద్, రజనిది లవ్ మ్యారేజ్. 2002లో సాయిచంద్, రజిని మొదటిసారి కలుసుకున్నారు. ఆమె క్లాసికల్ డాన్సర్. కూచిపూడిలో డిప్లొమా కూడా చేశారు. చాలా ప్రోగ్రాంలు ఇద్దరూ కలిసి చేశారు. ఆ క్రమంలోనే వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. కానీ ఎవరు ముందు బయటపడతారా అని ఇద్దరూ ఎదురు చూశారు. రజిని కంటే ముందే సాయిచంద్ ఆమెకు ప్రపోజ్ చేయడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించుకుండా సాయిచంద్ ప్రేమను ఒప్పుకున్నారు రజిని. ఆ తరువాత దాదాపు 8 ఏళ్ల పాటు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో తాను సాయిచంద్‌ను ప్రేమిస్తున్నట్టు ఇంట్లో చెప్పేశారు రజని. సాయిచంద్ అప్పటికే తెలంగాణ ఉద్యమంలో పేరున్న కళాకారుడు కావడంతో ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఇలా 2011 మే18న ఇద్దరూ పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కుటుంబంతో సంతోషంగా ఉండే ఫ్రీ టైం దొరకకపోయినా తన భార్య తనతో ఎప్పుడూ గొడవ పడలేదని.. ప్రతీ విషయంలో అర్థం చేసుకుంటుందని సాయిచంద్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రేమ నుంచి పెళ్లి వరకూ ఎలాంటి వివాదాలు లేకుండా సాగిన వాళ్ల ప్రయాణం.. సాయిచంద్ మరణంతో ఎడతెగని వేదనని మిగిల్చింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి