అశ్వద్ధామరెడ్డి వల్లే ఇంత ఆలస్యం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై థామస్‌రెడ్డి ఏమన్నారంటే..? ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి మూర్ఖత్వం వల్లే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలస్యమైందంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో థామస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు థామస్‌రెడ్డి. By Trinath 01 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి 2019లో టీఎస్‌ఆర్టీసీ చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా చాలా రోజులు టాప్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వచ్చింది. ప్రభుత్వాన్ని ఎదురిస్తూ.. తమ డిమాండ్లు నెరవేర్చాలని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పిల్లాపాపలతో..నడిరోడ్డుపై యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకం నిరసనలకు దిగడం రాష్ట్రాన్ని స్తంభింప చేసింది. ప్రజలను ఆలోచింపచేసింది. ఆర్టీసీ కార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించిన సమ్మె అది. ఈ నిరసనల తర్వాత ప్రస్తుత ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి(ashwathama reddy) పేరు మారుమోగినా.. ఈ ఉద్యమాన్ని వెనుక నుంచి నడిపించింది..లీడ్ చేసింది.. దశా దిశా నిర్దేశించిన వ్యక్తి తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి(thomas reddy). ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆయన ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత లేటు ఎందుకైంది? నిజానికి 2019లో దసర పండుగకు ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. దాదాపు రెండు నెలల ఉద్యమం తర్వాత కూడా ప్రభుత్వం మెట్టు దిగినట్టు అనిపించలేదు. అందులోనూ నిరసన చేస్తున్న ఆర్టీసీ(RTC) కార్మికులపై కేసీఆర్(KCR) ఓ రేంజ్‌లో మండిపోయి ఉన్నారు. సమ్మె(strike)కు దిగిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోంచి తొలగిస్తామని, ఎస్మా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు కూడా. అయితే ఈ పరిణామాలకు కారణం అశ్వద్ధామరెడ్డినేనంటూ విమర్శలు చేశారు థామస్ రెడ్డి. పేరు కోసం.. గుర్తింపు కోసం పాకులాడడని.. ప్రభుత్వాన్ని పడగొడతానంటూ గులాబీ సర్కార్‌ను బెదిరింపులకు గురి చేశాడని.. అందుకే కేసీఆర్‌కు కోపం వచ్చి అసలు తమ సమస్యలే పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు థామస్‌రెడ్డి. కేసీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ఇస్తారని.. బెదిరిస్తే మాత్రం ఇవ్వరని.. ఈ విషయం తెలిసి కూడా అశ్వద్ధామరెడ్డి ఓవర్ చేశారంటూ ఫైర్ అయ్యారు థామస్‌రెడ్డి. అశ్వద్ధామరెడ్డి వల్లే విలీనం ఆలస్యమైందని.. ఇందులో యూనియన్ల తప్పు ఏ మాత్రం లేదన్నారు. అంతేకాదు అశ్వద్ధామరెడ్డి మూర్ఖత్వం కారణంగానే ఉద్యమ సమయంలో 33మంది ప్రాణాలు విడిచారని.. వాళ్ల కుటుంబాలను ఆదుకోవాలని తాను చెప్పినా ఆయన అసలు పట్టించుకోలేదని ఆరోపించారు థామస్‌రెడ్డి. డబ్బులను కాజేయడమే కాకుండా ఆర్టీసీ సమ్మెను అశ్వద్ధామరెడ్డి పక్కదోవ పట్టించారని.. ఇప్పుడు రియల్ ఎస్టెట్‌లో పైసలు పొగేసుకుంటున్నారని విమర్శించారు. ఏది ఏమైనా ప్రస్తుతం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని.. ఈ డిసిషన్‌తో ఉద్యోగ భద్రతతో పాటు చాలా బెనిఫిట్స్ వస్తాయంటున్నారు థామస్‌రెడ్డి. సజ్జనార్‌కు చురకలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar)కు థామస్‌రెడ్డి చురకలంటించారు. వ్యక్తిగతంగా సజ్జనార్‌పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. అయితే ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల పనిభారం పెరిగిందన్నారు థామస్‌రెడ్డి. గతంలో 8 గంటల పని సమయం ఉంటే ఇప్పుడు 12గంటల వరకు వర్క్ చేయాల్సి వస్తుందన్నారు. అంతేకాదు బస్సుల సంఖ్య తగ్గిందని.. ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని విమర్శించారు. అయితే సజ్జనార్ వచ్చిన తర్వాత OD సిస్టమ్ తీసుకొచ్చారని.. జీతాలు ఇన్‌టైమ్‌లో పడుతుండడం మంచి విషయమన్నారు థామస్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి