BREAKING: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. మల్కాజ్ గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను ఫైనల్ చేశారు.

New Update
BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు

BRS MP Candidates: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. మల్కాజ్ గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను ఫైనల్ చేశారు. అయితే.. ఇటీవల మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు కేటాయించారు కేసీఆర్. తాజాగా శంబీపూర్ రాజుకు టికెట్ కట్ చేసి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి కేసీఆర్ టికెట్ కేటాయించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

ALSO READ: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

కవితకు నో టికెట్..

బుధవారం నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. నిజామాబాద్, చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ కు (Kasani Gnaneshwar) కేసీఆర్ చేవెళ్ల (Chevella) ఎంపీ టికెట్ ఇచ్చారు. అలాగే గత కొన్ని రోజులుగా  మాజీ మంత్రి కడియం శ్రీహరి.. తన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పడంతో.. కడియం ను కాపాడుకునేందుకు వరంగల్ (Warangal) ఎంపీ టికెట్ ను కూతురు కడియం కావ్యకు (Kadiyam Kavya) కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ ను కవితకు కాకుండా మాజీ ఎమ్మల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఇచ్చారు. అలాగే జహీరాబాద్ నుంచి గాలి అనిల్‌ కుమార్‌ అవకాశం ఇచ్చారు.

ఇప్పటికి వరకు ప్రకటించిన అభ్యర్థులు..

* పెద్దపల్లి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* కరీంనగర్ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
* మహబూబాబాద్ – మాలోత్ కవిత
* ఖమ్మం – నామా నాగేశ్వరరావు
* చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
* వరంగల్ – కడియం కావ్య
* మల్కాజ్ గిరి - రాగిడి లక్ష్మారెడ్డి
* ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
* నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్‌
* జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్

Advertisment
తాజా కథనాలు