/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Kawasaki-W175-1-jpg.webp)
జపనీస్ కు చెందిన ప్రముఖ బైక్ కవాసకి, ప్రపంచ మార్కెట్లో లగ్జరీ మోటార్ సైకిల్స్ విడుదల చేస్తూ చాలా పాపులర్ అయ్యింది. ఈ బ్రాండ్ నుంచి వచ్చే టూవీలర్స్ చాలా స్టైలీష్ గానూ. ప్రీమియం లుక్ లోనూ కనిపిస్తాయి. అయితే గతేడాది మార్కెట్లోకి వచ్చిన కవాసకి w175మోడల్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేదు. రూ. 1.47 లక్షల బేస్ ధరతో,కంపెనీ లైనప్ లో తక్కువ ధర కలిగిన మోటార్ సైకిల్ గా ఇది నిలించింది. అయితే ఈ బైక్ పై కస్టమర్ల నుంచి మిక్స్డ్ రెస్సాన్స్ రావడంతో కంపెనీ బైక్ ధరను భారీగా తగ్గించింది.
కవాసకి w175మోటార్ సైకిల్ ధరను కంపెనీ ఏకంగా రూ. 25వేలు తగ్గించింది. దీని ధర ఇప్పుడు 1.22 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే కలర్ వేరియంట్ ను బట్టి రూ. 1.3లక్షల వరకు ఉంటుంది. వాసకి కంపెనీ W175 లైనప్ లో మరో కొత్త ఎడిషన్ను విడుదల చేసింది. గతవారం జరిగిన ఇండియా బైక్ వీక్ 2023లో W175 స్ట్రీట్ అనే కొత్త వేరియంట్ ను ఈ బ్రాండ్ మార్కెట్లోకి పరిచయం చేసింది. ఈ బైక్ ట్యూబ్ లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. దీని ధర రూ. 1.35లక్షలు ఉంది.
వాసకి కంపెనీ W175 స్ట్రీట్ ధర రూ. 1.35లక్షలు కాగా తాజా ఆఫర్ తర్వాత ఓల్డ్ మోడల్స్ ధరలు భారీగా తగ్గించింది. ఇప్పుడు కవాసకి కంపెనీ W175 మెటాలిక్ ఓషన్ బ్లూ మోడల్ ధర రూ. 1.31 లక్షల వరకు తగ్గించింది. ఈ మోటార్ సైకిల్ మెటాలిక్ గ్రాఫైట్ గ్రే కలర్ లో ఉన్న వేరియంట్ ధర రూ. 1.29లక్షలు ఉండగా..కాండీ పెర్సిమోన్ రెడ్ వేరియంట్ రూ. 1.24లక్షలు, ఎబోని ఎడిషన్ ధర రూ. 1.22 లక్షలుగా ఉంది. కవాసకి W175 బైక్ 177 సీసీ ఎయిర్ కూల్డ్ సిలింల్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. 13హెచ్పీ పవర్, 13.2 ఎన్ ఎమ్ పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. అంతేకాదు 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో పెయిర్ ఇంజిన్ ఉంటుంది. ఈమోటార్ సైకిల్ డిఫరెంట్ కలర్ స్కీమ్స్ ,అల్లాయ్ వీల్స్ తో చూడటానికి సరికొత్త లుక్ లో కనిపిస్తుంది.
హాలోజన్ హెడ్ ల్యాంప్, సింగిల్ ఛానల్ ఏబీసీతో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ చిన్న ఎల్సీడీ డిస్ప్లేతో కూడిన రెట్రో స్పీడో మీటర్, పీ షూటర్ ఎగ్జాస్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ బైకులో ఉన్నాయి. అయితే ఇది మోడర్స్, అడ్వాన్స్డ్ బైక్ గా నిలవలేదు. ఇప్పటికే ఇతర కంపెనీల ప్రీమియం బైక్స్ లో వచ్చిన కంపోనెంట్స్ ఇందులో కూడా ఉన్నాయి. దీంతో మార్కెట్లో ఈ బైక్ పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. ప్రస్తుతం కవాసకి బైక్ మార్కెట్లో యమహా FZ-X బైక్ కు పోటీగా ఉంది. అయితే కంపెనీ తాజా నిర్ణయంతో కవాసకి అన్ని వేరియంట్లు ఇప్పుడు యమహా FZ-X కంటే తగ్గింది. అయితే కంపెనీ ధరలను తగ్గించినప్పటికీ ఈ బైక్ లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.