/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T161244.394.jpg)
Amitabh Bachchan on Kavya Maran: ఐపీఎల్ 2024(IPL 2024) ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలన్న ఈ జట్టు కల చెదిరిపోయింది.ఇదే క్రమంలో హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే హైదరాబాద్ జట్టు పరాజయం తర్వాత జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు.
అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సన్ రైజర్స్ ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టు తన బ్లాక్ లో పేర్కొన్నారు.ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని అమితాబ్ అన్నారు.మ్యాచ్ అనంతరం కావ్య మారన్ కన్నీళ్లు ఆపుకోవడం చూసి, చాలా బాధపడ్డానని అమితాబ్ తెలిపాడు.
A season to be proud of 🧡#KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM
— JioCinema (@JioCinema) May 26, 2024
చెన్నైలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత కోల్‌కతా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఆ సమయంలో కెమెరాలు స్టాండ్స్‌లో ఉన్న SRH ఓనర్ కావ్యని ఫోకస్ చేయగా..ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపించింది.
Also Read: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !