MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మోదీని ఎందుకు నిలదీయరు? కవిత సీరియస్ కామెంట్స్
మహిళా రిజర్వేషన్లను అమలు చేయని ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతల వైఖరిని ఆమె తప్పు పట్టారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మహిళా రిజర్వేషన్లను అమలు చేయటానికి తాము ముందుకే వెళతానని స్పష్టంగా చెప్పారు.
Kavitha Comments on Women Reservations: రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తాను తలకెత్తుకోలేదని, ఇది మహిళలందరి ఆకాంక్ష అది అని కవిత స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి డిసెంబరులో తాను మళ్లీ దీక్ష చేయాలనుకుంటున్నానని, దీని కోసం మహిళా రాజకీయనేతలను ఆహ్వానించాలనుకుంటున్నట్టు చెప్పారు.
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతిఇరానీలను ఆహ్వానిస్తామని అన్నారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే..
* రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళారిజర్వేషన్లు బిల్లు మూడేళ్లయినా ఆమోదం పొందకపోవటమేమిటి?
* పార్లమెంటులో (Parliament) మహిళలు కేవలం 12 శాతం మందే ఉన్నారు.
* తొలి లోక్ సభలో 8శాతం మహిళలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12శాతానికి చేరుకుంది.
* మహిళలు ఉన్నతస్థానాలకు చేరకూడదా? సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా?
* మహిళా రిజర్వేషన్ (Women Reservations) అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి తదితర నేతలు ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?
* యూపీలో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారు.
* గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారు. ఇంత కంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా?
* ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ కాంగ్రెస్ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు.

* మోదీ సర్కారు (Modi Govt) రిజర్వేషన్ బిల్లును ఆమోదించటంలో తాత్సారం చేస్తోంది.

Also Read: నేడే మెదక్ కు సీఎం కేసీఆర్..గులాబీమయమైన జిల్లా కేంద్రం