MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత ఎక్కడికీ పారిపోరని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయన్నారు. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. By Jyoshna Sappogula 27 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ విచారణ జరుపుతున్నారు. కవిత తరఫున వాదనలు వినిపిస్తున్నా న్యాయవాది ముకుల్ రోహత్గీ.. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని.. ఎక్కడికీ పారిపోరని అన్నారు. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారని.. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. Also Read: కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉంటున్నారని, సీబీఐ కేసులో 4నెలలు జైల్లో ఉంటున్నారన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారని.. కవిత ఎవరినీ బెదిరించలేదని తెలిపారు. 493 మంది సాక్ష్యులను విచారించారని.. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని.. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయన్నారు. ఈడీ తరుఫున న్యాయవాది ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. విచారణ సమయంలో కవిత సహకరించలేదన్నారు. ఈడీ నోటీస్ రాగానే కవిత అన్ని ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారని.. సాక్ష్యాలను కవిత తారుమారు చేశారని పేర్కొన్నారు. కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో కవితకు ఎలా బెయిల్ ఇస్తారు? అని ప్రశ్నించారు. #kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి