KTR: లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెకు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి ఈడీ విమానంలో తరలిస్తోంది. రేపు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట కవితను ఈడీ హాజరుపరచనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. కవిత అరెస్ట్ పై ఢిల్లీలోని న్యాయవాదులతో చర్చించనున్నారు. కవిత అరెస్ట్ కు కౌంటర్ గా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ALSO READ: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి!
లాఠీ ఛార్జ్ నడుమ ఢిల్లీకి..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేయడం ఈడీ కి పెద్ద టాస్క్ లాగా మారిందనే చెప్పాలి. కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమె ను అరెస్ట్ చేస్తారని తెలిసి.. ఆందోళన చేపట్టారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్న అధికారులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. కవిత వెళ్తున్న కారుకు అడ్డం పడ్డారు. దీంతో వారిని కారుకు అడ్డు తొలిగించేందుకు చేసేది ఏమి లేక పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ లో కొందరు బీఆర్ఎస్ శ్రేణులకు గాయాలు అయ్యాయి. లాఠీ ఛార్జ్ నడుమ కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు అధికారులు.
కవిత అరెస్ట్ కు ముందు కేసీఆర్ కీలక భేటీ..
కవిత ఇంట్లో ఈడీ రైడ్లు జరగడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ సంతోష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. కవితపై జరుగుతున్న ఈడీ రైడ్లపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.