Kavitha Arrest: రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు హరీష్. రేపు లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న ఒకరోజు ముందు కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అని అన్నారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

Harish Rao on MLC Kavitha Arrest: కవిత అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. రేపు లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న ఒకరోజు ముందు కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బ తీసేందుకు బీజేపీ ఆడుతున్న కుట్ర అని మండిపడ్డారు. ఇవాళే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని.. ఈ నెల 19న సుప్రీం కోర్టు విచారణ అనంతరం అరెస్ట్ చేయొచ్చు కదా అని అన్నారు. కోర్టుకు శనివారం, ఆదివారం సెలవు ఉంటుందనే తెలిసి కావాలనే కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.

ALSO READ: కవిత అరెస్ట్.. ఢిల్లీకి కేటీఆర్

మాకు ఇది కొత్త కాదు..

కవిత అరెస్ట్ పై సీరియస్ అయ్యారు హరీష్ రావు. లోక్ సభ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో తమ నేతలపై కేసులు పెట్టి వాళ్ళ పార్టీలోకి లాగాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలు కేసులకు భయపడే వాళ్ళు కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము ప్రాణాలే లెక్క చేయలేదని.. ఆనాటి ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టిన.. బెదిరింపులకు పాల్పడిన జంక కుండా ఎదురుండి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తాము ఇలాంటి కేసులకు భయపడే వాళ్ళం కాదని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసిన తాము భయపడేది తేలదని అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు..

తెలంగాణలో కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. లోక్ సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకే తమ పార్టీ నాయకురాలైన కవిత పై తప్పుడు ఆరోపణలు చేసి.. కేసులు పెట్టి.. అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అర్థం ఏంటనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా కోర్టులో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండు పార్టీలు కలిసి కేసీఆర్ పేరు బద్నామ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. కవిత అరెస్ట్ కు నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు