Breaking : టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్..!! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విషయమై ఈమధ్యే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో కాసాని జీర్ణించుకోలేకపోయారు. ఈ తరుణంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. By Bhoomi 30 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విషయమై ఈమధ్యే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో ఇప్పటికే అనేకసార్లు తమ పార్టీ పోటీ ఉంటుందని చెప్పిన కాసాని...30మందితో అభ్యర్థుల తొలిజాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత అనూహ్యంగా పరిస్థితి తారుమారు అయ్యిది. దీంతో కాసాని జీర్ణించుకోలేకపోయారు. ఈ తరుణంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి