Karthika Masam: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా!

కార్తీక మాసం విష్ణు పరమేశ్వరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెడతారు. ఇలా నదిలో దీపాలను వదిలిపెట్టడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Karthika Masam: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా!
New Update

Karthika Masam: కార్తీక మాసం అంటే శివకేశవులిద్దరికీ చాలా ప్రీతికరమైన రోజు. విష్ణు పరమేశ్వరుల అనుగ్రహం పొందేందుకు వారిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మోక్షం మార్గానికి దారి చూపేందుకు దీపాలను వెలిగించి పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం మొదలు రోజు నుంచి నెలరోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ దీపారాధన చేస్తూంటారు.

తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానం చేసి పూజలు చేసి దీపాలను పెగుతుంటారు. ఇలా చేయడం వల్ల తమతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో దీపాలను నదులు, కొలనుల్లో వదులుతారు. అసలు దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా..!

కార్తీక మాసంలో నీటిలో దీపాలను వదలడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా నీటి ప్రవాహం ఉన్న చోటు మహిళలు నిర్వహిస్తుంటారు. దీపాలను వదలడానికి గల కారణాలను పండితులు ఈ విధంగా చెబుతున్నారు. పంచభూతాలు అయినటువంటి ఆకాశం, గాలి, నీరు, భూమి నిత్యం చూస్తుంటాం..ఈ మాసంలో వాటికి జతగా నిప్పు అంటే దీపాలను కలపడం వల్ల పంచభూతాలను ఒకేసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం తో పాటు పుణ్యం కూడా లభిస్తుందని తెలుపుతున్నారు.

కార్తీకంలో పూజించే శివుడ్ని స్మరించడానికి ఎక్కువగా నమః శివాయ అనే పంచాక్షరీని ఉపయోగిస్తూంటారు. అందులోనే ఈ పంచభూతాలు మిళితమై ఉన్నాయని పండితులు వివరిస్తున్నారు.అందుకే ప్రదోష కాలంతో పాటు, సంధ్యా సమయంలోనూ మహిళలు దీపాలను నదుల్లో విడిచిపెడుతుంటారు.

ఇలా చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుందని పండితులు వివరిస్తున్నారు.ఇక ఈ మాసంలో చేసే దానాలకు గొప్ప విశేషతం ఉంది. గంగా స్నానం చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజు గంగాస్నానం చేసిన తర్వాత దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీంతో అన్ని పాపాలు, బాధలు దూరమవుతాయి. భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఈ మాసంలో దీపదానం చేస్తారు.

ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. సంపద పెరుగుతుంది. శ్రీమహావిష్ణువు ఆశీస్సులు అందుకుంటారు. నెలంతా సాధ్యం కాని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయిన ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

Also read: కార్తీక మాసంలో గంగాస్నానం చేసి ఈ ఒక్క వస్తువు దానం చేస్తే చాలు..మీ పంట పండినట్లే..!!

#karthika-masam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe