Karthika Deepam: హిమ, సౌర్య ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

కార్తీకదీపం సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి పాపులర్ అయ్యారు సహృద, కృతిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలు హీరోయిన్ రేంజ్‌లో కనిపిస్తున్నారు. వీరి లేటెస్ట్ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరూ హీరోయిన్‌గా అలరిస్తారా? లేక సీరియళ్లలో నటిస్తారా? అనే ఆలోచనలో పడ్డారు.

Karthika Deepam: హిమ, సౌర్య ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
New Update

Karthika Deepam Serial Child artist: తెలుగు రాష్ట్రంలో కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టోరిగా తెరికెక్కిన ఈ సీరియల్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళలు సీరియల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉండేవారు. డాక్టర్ బాబు, దీప ఎమోషనల్ సీన్స్ కనిపించిన చాలు టీవీల ముందు ఏడ్చేవారు.

publive-image

క్రమం తప్పకుండా ప్రతిరోజూ కార్తీక దీపం సీరియల్ చూసేవారు. 1500కు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుని పూర్తి అయినా.. ఈ సీరియల్ గురించి ఎవరూ మరిచిపోరు. ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే సీరియల్ లా చూపించడంతో ఫ్యాన్స్ వీపరీతంగా ఉండేవారు. ఈ క్రమంలో ఇందులో నటించిన వారు పాపుల్ అయ్యారు.

publive-image

ఈ సీరియల్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు దీప అలియాస్ వంటలక్క, డాక్టర్ బాబు. ఈ దంపతులకు కవలలు జన్మిస్తారు. వీరిలో చిన్న కూతురు హిమ. పెద్ద కూతురు సౌర్య. ఈ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా అదరగొట్టారు.హిమ అసలు పేరు బేబీ సహృద. అమె సీరియల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఎన్నో విషాదాలను చూశారు. ఓసారి తన పర్సనల్ విషయాలను చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కార్తీక దీపం సీరియల్ పూర్తయిన తరువాత బేబీ సహృద చదువుపై ఫొకస్ పెట్టింది.

publive-image

సౌర్య అసలు పేరు కృతిక. తను కూడా స్టడిస్ పై ఫోకస్ పెట్టింది. అయితే అప్పడప్పుడు పలు కార్యక్రమాలలో ఈ ఇద్దరు సందడి చేస్తు ఉంటారు. ప్రస్తుతానికి సీరియళ్లలో ఎక్కువగా నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. రీల్స్ చేస్తూ ఆడిషన్స్ ను ఖుషి చేస్తు ఉంటారు. అంతేకాదు, ఫెస్టివల్స్ అప్పుడు అందంగా రెడీ అయి ఫొటోలను కూడా అప్లోడ్ చేస్తు ఉంటారు. ఇద్దరికిద్దరూ హీరోయిన్ రేంజ్ లో ఎదిగారు. అయితే, ఈ అమ్మయిలు ఇద్దరూ వెండితెరపై హీరోయిన్ గా అలరిస్తారా? లేక సీరియళ్లలో నటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Also Read: హీరో బాలకృష్ణకు ఎమ్మెల్సీ సునీత మాస్ వార్నింగ్.!

#karthika-deepam-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe