/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-22T105940.355-jpg.webp)
Karthika Deepam: బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతాయి.. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సీరియల్స్ లో ముందుగా గుర్తొచ్చేది కార్తీక దీపం. అప్పట్లో స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. కేవలం టీవీలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్ కు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్ లో నటించిన ప్రతీ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటుంది. వారిలో ఒకరు దివ్య శ్రావణి. ఈమె మోనిత దగ్గర పని చేసే అల్లరి పనిమనిషి ప్రియమణి పాత్రలో నటించింది. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.
Also Read: RC16 Movie: విలన్ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్
"నిన్ను కలవకపోయుంటే బాగుండేది".. దివ్య శ్రావణి పోస్ట్
అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. "నిన్ను కలవకపోయుంటే బాగుండేది.. నీ ప్రేమలో పడకపోయి ఉంటే బాగుండేది" అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో కింద 'నిన్ను కలవకపోయుంటే బాగుండేది' అనే క్యాప్షన్ పెట్టి దానికి హార్ట్ బ్రేక్ ఇమేజీని జోడించింది. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే హార్ట్ బ్రేక్ అయ్యిందా..? లేదా కేవలం రీల్ కోసం మాత్రమేనా అని కామెంట్స్ చేస్తున్నారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలు, హాట్ ఫోటో షూట్ షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఈ అమ్మడుకు ఇన్స్టాగ్రామ్ లో 89k ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం దివ్య శ్రావణి తెలుగులో ఎలాంటి చేస్తున్నట్లుగా లేదు.
View this post on Instagram