New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Karnool-Dead-Bodies-.jpg)
కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు కలకలం సృష్టించాయి. గార్గేయపురం చెరువులో రెండు మృతదేహాలతో పాటు.. ఒడ్డున మరో హిజ్రా మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎవరైనా తీసుకువచ్చి ఇక్కడ చంపి పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించాలని కోరుతున్నారు.
తాజా కథనాలు