Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు కాస్త ఊరట

పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు కాస్త ఊరట లభించింది. ఆయనకు మరో రెండువారాలు బెయిల్‌ను పొడిగించింది హైకోర్టు. కాగా ఆయనపై రెండువారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సీఐడీకి వీలు లేకుండా పోయింది.

Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు కాస్త ఊరట
New Update

Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు కాస్త ఊరట లభించింది. ఆయనకు మరో రెండువారాలు బెయిల్ ను పొడిగించింది. తనపై నమోదు అయిన పోక్సో కేసును రద్దు చేయాలని యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయనకు రెండు వారాల మద్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సీఐడీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆయనపై రెండువారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సీఐడీకి వీలు లేకుండా పోయింది. పోక్సో కేసులో యడియూరప్పపై సీఐడీ పోలీసులు గురువారం ఛార్జీ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఛార్జీ షీట్ లో ఏముంది?

ఇటీవల యడియూరప్పపై లైంగిక ఆరోపణలు రావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై తాజాగా పోక్సో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన నేర విచారణ సంస్థ (CID).. తన ఛార్జిషీటులో కీలక విషయాలు చేర్చింది. యెడియూరప్ప ఆ బాలికను లైంగికంగా వేధించాడని.. ఆ తర్వాత ఆ బాలికకు, తల్లికి డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది. ఛార్జీషీటు ప్రకారం.. ‘ఆ బాలిక, తల్లి ఇద్దరూ యెడియూప్ప వద్దకు వచ్చినప్పుడు.. ఆయన ఆ బాలిక కుడి చేతిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెను మీటింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్‌ వేశారు. లోపల.. యెడియూరప్ప ఆమెను రేప్‌ చేసిన వ్యక్తి గుర్తున్నాడా అని అడిగారు. ఆరున్నరేళ్ల వయసున్న ఆ బాలిక గుర్తున్నట్లు చెప్పడంతో.. ఆయన ఆమెతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అధికారులు నిర్దారించారు.

#yediyurappa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe