ధర్నా చౌక్ వద్ద కర్ణాటక రైతుల ఆందోళన.! కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపిస్తున్నారు కర్ణాటక రైతులు. ధర్నా చౌక్ వద్ద కర్ణాటక రాజ్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేవలం రాత్రి రెండు గంటలు.. పగలు మూడు గంటలు మాత్రమే కరెంటు సప్లై చేస్తుందని మండిపడ్డారు. By Jyoshna Sappogula 22 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కర్ణాటక రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ద్వజమెత్తారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతులతో ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్దపు హామీలతో రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also read: నా వెంట్రుక కూడా పీకలేరు.. బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్ రైతులకు ఉచిత కరెంటు అని చెప్పిన కాంగ్రెస్..ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. స్వామినాథన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో రాజకీయ నాయకుల మాటలు వినకూడదని సూచించారు. రైతుని ఎవరైతే ఆదుకుంటారో అలాంటి వారినే గెలిపించుకోవాలని హితవు పలికారు. కల్లబొల్లి మాటలతో మోసపోవద్దని రైతులకు హెచ్చరించారు. రైతులను ఆదుకునే పార్టీలకే ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Also read: పువ్వాడా మజాకా.. మార్క్ ప్రచారంతో హోరెత్తిస్తున్న మంత్రి.. ఫోటోలు వైరల్.. కర్ణాటక రాజ్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు కర్ణాటక రైతులు. కర్ణాటకలో 8 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని సూచిస్తున్నారు. రాత్రి రెండు గంటలు.. పగలు మూడు గంటలు కాంగ్రెస్ పార్టీ కరెంటు సప్లై చేస్తుందని తెలిపారు.కర్ణాటక రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా ఎండగడతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు చేసే వాళ్ళనే ఎన్నికల్లో ఎన్నుకోవాలని తెలంగాణ రైతులను కోరుతున్నారు. కర్ణాటక రైతు రాజ్య సంఘానికి 40 ఏళ్ల పోరాట నేపథ్యం ఉందని వెల్లడించారు. మా సొంత ఖర్చులతో వచ్చాం..ఏ పార్టీకి అనుబంధ సంఘం కాదని వ్యాఖ్యనించారు. బీ ఆర్ ఎస్ పార్టీ ప్రోత్సాహంతో నిరసనలు చేస్తున్నామని చెప్పడంలో అర్థం లేదని..రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రమైనా వెళ్తామని తేల్చి చెప్పారు. కాగా, తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. #congress #karnataka-farmers-protest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి