Siddaramaiah: ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ముడా స్కామ్‌ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధమని ఖండించారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్రపన్నాయని ఆరోపించారు.

New Update
Siddaramaiah: ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా స్కామ్‌లో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధమని ఖండించారు. రాజీనామా చేసేందుకు తానేమీ తప్పు చేయలేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్రపన్నాయని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతల మద్దతు ఉందని అన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికంగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.

విచారించేందుకు అనుమతి..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. అక్కడి రాజకీయాల్లో కలకలం రేపుతున్న మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) స్కామ్ కేసులో సిద్ధరామయ్య విచారణ ఎదుర్కోనున్నారు. ఆయనను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్‌ ద్వారా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గతంలో నోటీసులు..

జూలై 26న, గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అతను ఎందుకు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోకూడదో ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. దీనికి ప్రతిస్పందనగా, గవర్నర్ తన రాజ్యాంగ పాత్రను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కర్ణాటక మంత్రివర్గం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు