Bengaluru: నైట్ పబ్‌కి వెళ్లింది.. తెల్లారి రోడ్డుపక్కన లేచింది.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సీసీటీవీ చెక్ చేయగా.. అసలు మ్యాటర్ తేలింది. పబ్‌లో నైట్ ఫుల్లుగా తాగిన ఆమె.. 2 కి.మీ నడుచుకుంటూ వెళ్లింది. తాగిన మైకంలో రోడ్డుపై పడిపోయింది. ఆ దెబ్బలు చూసి అత్యాచారం చేశారని అనుకుంది. By Shiva.K 16 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పబ్‌కి వెళ్లిన మహిళ.. మరుసటి రోజు ఉదయం వేరొకరి ఇంటి వద్ద నిద్ర లేచింది. ఇందులో ట్విస్ట్ ఏం లేదు కానీ.. చేతికి తగిలిన గాయం చూసి తనను గ్యాంగ్ రేప్ చేశారంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయ్యింది. అసలేం జరిగిందా? అని కూపీ లాగిన పోలీసు అధికారులకు దిమ్మతిరిగే నిజం తెలిసింది. ఏమీ జరుగలేదని.. ఇక ఇంటికెళ్లండని మహిళను పంపించేశారు పోలీసులు. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్(25-30 ఏళ్ల వయసు) నైట్ పబ్‌కి వెళ్లింది. బాగా మద్యం సేవించింది. మద్యం మత్తులోనే రాత్రి దాదాపు 2 కిలోమీటర్లు నడిచింది. ఓ చోట స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటి తరువాత మెళకువ రావడంతో పక్కనే ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లింది. డోర్ కొట్టగా.. ఆ ఇంటి వారు తలుపు తీశారు. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తన చేతులకు అయిన గాయాలను చూపింది. దాంతో మహిళకు ఆశ్రయం ఇచ్చారు ఆ ఇంటివారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు.. అసలు జరిగిందేంటో గుర్తించారు. ఆమెకు క్లాస్ పీకి పంపించేశారు. సీసీ టీవీ ఫుటేజీల ప్రకారం.. ఫుల్లుగా మద్యం సేవించిన మహిళ ఆటూ ఇటూ ఊగిపోతూ బయటకు వచ్చింది. దాదాపు 2 కిలోమీటర్లు రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది. కొన్ని చోట్ల ఆమె కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయింది. తెల్లవారుజామున మెళకువ రావడంతో లేచింది. ఓ ఇంటి పక్కన ఉండటంతో షాక్ అయ్యింది. తన ఒంటిపై గాయాలు చూసి తనకు ఏదో జరిగిందని, తనపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని భావించి.. పక్కనే ఓ ఇంటికి వెళ్లింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను కాపాడారు. ఆమెపై అత్యాచారం జరుగలేదని, కింద పడటం వల్ల దెబ్బలు తగినట్లు తెలిపారు. దాంతో మహిళ ఊపిరి పీల్చుకుంది. Also Read: వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్.. రూల్స్ ఇవేనా?! #bengaluru మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి