Karimnagar: తండ్రి ప్రాణం తీసిన కూతురు సెల్ఫీ.. ఎల్ఏండీలో ఘోర విషాదం!

కరీంనగర్ లోయర్ మ్యానేర్ డ్యాంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విజయ్ ఫ్యామిలీ సరదాగా గడిపేందుకు డ్యాంకు వెళ్లగా కూతురు సెల్పీ తీసే క్రమంలో నీటిలో జారిపడింది. బిడ్డను కాపాడిన విజయ్.. నీటిలోనే ముగిని తనువు చాలించడం స్థానికులను కలిచివేసింది.

New Update
Karimnagar: తండ్రి ప్రాణం తీసిన కూతురు సెల్ఫీ.. ఎల్ఏండీలో ఘోర విషాదం!

LMD: కరీంనగర్ లోయర్ మ్యానేర్ డ్యాంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న విజయ్ (47) సోమవారం సెలవు దినం కావడంతో ఫ్యామిలీతో పొట్టపల్లి స్వయం భూ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలోనే ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లగా.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. దీంతో కూతురు మునిగిపోవడం చూసి వెంటనే అప్రమత్తమైన తండ్రి విజయ్ నీటిలో దూకాడు. ఆ వెంటనే విజయ్ కొడుకు 10వ తరగతి చదివే విక్రాంత్ సైతం డ్యాంలో దూకాడు.

ఈ క్రమంలో ముగ్గురు మునిగిపోయారు. ఒడ్డున కూర్చున్న తల్లి ఒక్కసారిగా అర్థనాదాలు పెట్టడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలో దూకి కూతురును, కుమారుడిని కాపాడాడు. నీటిలోతులో మునిగిపోయిన విజయ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో అప్పటిదాకా సంతోషంగా గడుపుతూ తమ కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో పిల్లలు డాడీ వస్తాడు, డాడీకి ఎం కాలేదంటూ గుండులు బాదుకుంటూ ఏడవటం అందరినీ కన్నీరు పెట్టించింది. విషయం తెలుసుకున్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఘటన స్థలానికి చేరకుని విజయ్ ఫ్యామిలీని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు