కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

కరీంనగర్ జిల్లాలోని అపోలో రీచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. సాయిశ్రీ అనే 14 ఏళ్ల బాలికకు మెదడులో రక్తం గడ్డ కట్టగా ఫిలిప్స్ అజ్యూరియస్ క్యాతలాబ్ సాయంతో అపోలో రీచ్ ఆసుపత్రి వైద్య బృందం చికిత్సను అందించి సక్సెస్‌ సాధించారు. సెరబ్రల్ ఆంజియోగ్రఫీ, మెకానికల్ త్రంబెక్టమీ అనే ప్రత్యేక పద్ధతిలో ఈ సర్జరీ చేసినట్లు వైద్యబృందం తెలిపింది.

కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స
New Update

karimnagar-distrcit-apollo-hospital-new-record-operation-success-brain-blood-clott

కరీంనగర్ జిల్లాలోని అపోలో రీచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. సాయిశ్రీ అనే 14 ఏళ్ల పాపకు మెదడులో రక్తం గడ్డ కట్టడానికి కారణం గుండెలో ఎల్.ఏ.మిక్టోమా అనే అరుదైన కణతి కారణమని వైద్యులు గుర్తించారు. కణతిని తొలగించి అరుదైన ఆపరేషన్‌ను న్యూరో ఎక్పర్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ కామిన్వార్, కార్డియాలజిస్ట్ అనిల్ కుమార్ మల్పూర్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం విజయవంతంగా కంప్లీట్‌ చేశారు.

అంతేకాదు.. పాపకు మెదడులో కణతి ఏర్పడి ఎంతో ఇబ్బందులకు గురవుతున్న కారణంగా వైద్యులు గుర్తించి చికిత్సను అందించినట్లు తెలిపారు. అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ చికిత్సను కరీంనగర్ అపోలో ఆసుపత్రిలో నిర్వహించినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడం పట్ల వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ నాగ సతీష్, వైద్యులు అనిల్ కుమార్, సంజయ్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe