Kapu Ramachandra Reddy: కాంగ్రెస్ పార్టీ CWC మెంబర్ రఘువీరారెడ్డిని కలిశారు వైసిపి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి. నీలకంఠేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. దాదాపు రెండు గంటల పాటు కుటుంబ సమేతంగా రఘువీరాతో పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వనందుకు ఇటీవలే వైసిపికి గుడ్ బాయ్ చెప్పిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: రాజ్యసభకు ఆ ముగ్గురు నేతలు.. వైసీపీ ఖరారు చేసిన లిస్ట్ ఇదే!
వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రిసెంట్ గా అధికార పార్టీ వైసీపీకి రాజనీమా చేసిన సంగతి తెలిసిందే. నమ్మినందుకు గొంతు కోశారు, ఘోరంగా అవమానించారని ఆరోపిస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు.. ఇండిపెండెంట్ గా రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి నేను, నా భార్య లేదా కొడుకు పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
నమ్మించి గొంతుకోశారు: కాపు
జగన్ మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులుకుని వచ్చానని.. గతంలో మంత్రి పదవి ఇస్తా అని పదవి ఇవ్వలేదని అన్నారు. సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారని..చెత్త సర్వేలు చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మినందుకు గొంతుకోశారని.. ఇంతకంటే అవమానం లేదని.. ఏ పార్టీలో అవకాశం వచ్చినా పోటీ చేస్తాం లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాపు రామచంద్రా రెడ్డికి అండగా కాంగ్రెస్?
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ CWC మెంబర్ రఘువీరారెడ్డిని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి కలవడం సంచలనంగా మారింది. కుటుంబ సమేతంగా రఘువీరాతో చర్చించడంతో ఇక ఆయనకు కాంగ్రెస్ అండగా ఉంటుందని..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుండే పోటీ చేసే అవకాశం ఉంటుందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది.