Kangana Ranaut: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా..కంగనా సంచలన వ్యాఖ్యలు.!

పొలిటికల్ ఎంట్రీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ కృష్ణుడు ఆశీర్వదిస్తే తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు.

New Update
Lok Sabha Elections 2024: బీజేపీ నుంచి  కంగనా పోటీ..ఎక్కడి నుంచి అంటే.?

Kangana Ranaut on political entry : బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.సినిమాల ద్వారా అలాగే కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది కంగనా రనౌత్‌.

publive-image

తాజాగా, గుజరాత్ లోని ద్వార‌కాలో కృష్ణుడి ఆల‌యాన్ని సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). అనంతరం ఆమె ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ..పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు.

Also Read: మా బంధం ప్రత్యేకం.. ఇది ప్రేమతో కూడిన మధురానుబంధం.. నాగబాబు ఎమోషన్..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. 600 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండడడంపై ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బిజెపి ప్రభుత్వం కృషి కారణంగానే 600 సంవత్సరాల పోరాటం తర్వాత భారతీయులకు ఈ సుదినం రానున్నదని ఆమె అన్నారు. అత్యంత వైభవోపేతంగా అయోధ్య రామాలయాన్ని ప్రారంభించుకుంటామని ఆమె చెప్పారు. స‌నాత‌న ధ‌ర్మం జెండా విశ్వ‌వ్యాప్తంగా ఎగ‌రాల‌ని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

publive-image

స‌ముద్రంలో మునిగిన ద్వార‌కా న‌గ‌ర అవ‌శేషాల‌ను వీక్షించేందుకు యాత్రికుల‌ను అనుమ‌తించేలా ప్ర‌భుత్వం త‌గిన ఏర్పాట్టు చేయాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేసింది. ద్వార‌కాధీశుడిని చూసేందుకు తాను వీలు ఉన్నప్పుడల్ల ఇక్క‌డకు వ‌స్తుంటాన‌ని కంగ‌నా తెలిపింది. ద్వార‌క అద్భుత‌మైన దైవిక న‌గ‌ర‌మ‌ని, ఇక్క‌డ ప్ర‌తిఒక్క‌టీ అబ్బుర‌ప‌రిచేలా ఉంటుంద‌ని ఆమె పేర్కొంది. ఆమె న‌టించిన తేజాస్ చిత్రం ఇటీవ‌ల విడుద‌ల కాగా అందులో భార‌త వైమానిక ద‌ళ పైల‌ట్‌గా కంగ‌నా న‌టించింది.

#Kangana Ranaut
Advertisment
తాజా కథనాలు