Lok Sabha Elections 2024: బీజేపీ నుంచి కంగనా పోటీ..ఎక్కడి నుంచి అంటే.?

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీకి దింపినట్లు పార్టీ ప్రకటించింది. 

New Update
Lok Sabha Elections 2024: బీజేపీ నుంచి  కంగనా పోటీ..ఎక్కడి నుంచి అంటే.?

Lok Sabha Elections 2024:  లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదవ జాబితాను బీజేపీ నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నటి కంగనా రనౌత్‌కి కూడా బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీకి దింపినట్లు పార్టీ ప్రకటించింది.

చంద్రాపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుధీర్‌ ముంగుంటివార్‌పై మాజీ ఎంపీ సురేశ్‌ ధనోర్కర్‌ భార్య ప్రతిభా ధనోర్కర్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిపింది. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ టికెట్ రద్దు కాగా, ఇక్కడి నుంచి జితిన్ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. బక్సర్ నుంచి అశ్విని చౌబే టికెట్ రద్దు చేయగా, పశ్చిమ చంపారన్ నుంచి సంజయ్ జైస్వాల్‌కు టికెట్ ఇచ్చారు. పూరీ నుంచి సంబిత్ పాత్రకు టికెట్ దక్కింది. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసేందుకు సురేంద్రన్‌కు టిక్కెట్టు ఇచ్చారు.

తూర్పు చంపారన్‌ నుంచి రాధామోహన్‌సింగ్‌కు, బెగుసరాయ్‌ నుంచి గిరిరాజ్‌సింగ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఉజియార్‌పూర్‌ నుంచి నిత్యానంద్‌కు టికెట్‌ ఇచ్చారు. రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ మీరట్-హపర్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యారు.

ఇది కూడా  చదవండి:  మందులో నీళ్లు కలుపుకోవాలా? సోడానా కలపాలా? రెండింటిలో ఏది మంచిది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు