Kangana Ranaut: ఇది కదా నిజమమైన భారతీయత అంటే.. చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మహిళా సైంటిస్ట్‌లను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టారు. By BalaMurali Krishna 27 Aug 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మహిళా సైంటిస్ట్‌లను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టారు. "భారత ప్రధాన శాస్త్రవేత్తలు వీరు.. వీరిలో ప్రతి ఒక్కరూ బొట్టుబిళ్ల, కుంకుమ, మంగళ సూత్రంతో కనపడుతున్నారు. నిరాడంబర జీవితం గడుపుతూ, ఉన్నతంగా ఆలోచించే విధానానికి వీరు ప్రతీక. నిజమైన భారతీయతా స్వభావం ఇదే" అని తన ఇన్‌స్టా స్టోరీస్ పెట్టారు. ప్రస్తుతం కంగాన స్టోరీ వైరల్ అవుతోంది. ఇది కదా భారతీయతే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చీరలు ధరించి సంప్రదాయబద్ధంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప శాస్త్రవేత్తలు అయిన వీరు భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ ఇంత నిరాడంబరంగా ఉండటం గొప్ప విశేషం. భారత మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు దేశ బాధ్యతలు కూడా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. తాజాగా ఇస్రో మహిళా శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కూడా అభినందించిన సంగతి తెలిసిందే. వారితో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ప్రధాని మోదీ తమను మెచ్చుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కంగనా రనౌత్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చంద్రముఖి-2 చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించిన బ్లాక్‌బాస్టర్ మూవీ చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వినాయక చవతి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి