Health Tips : డయాబెటిస్ పేషెంట్స్ కు ఇది సూపర్ ఫుడ్...మరెన్నో రోగాలకు చెక్ ..!!

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కందదుంపలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. కందదుంపల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ పేషంట్లకు సూపర్ ఫుడ్.

Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు
New Update

మన దేశంలో లభించే పలు రకాల దుంపల్లో కంద ఒకటి. దీనితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. దీని ప్రత్యేక రుచికి ఎంతో మంది ఫిదా అయిపోతారు. అయితే ప్రస్తుతం చాలా తక్కువమంది కంద దుంపలను ఆహారంలో చేర్చుకుంటున్నారు. వీటిని కట్ చేస్తే ఏనుగు పాదం వల్లే కనిపిస్తుంది. అయితే వీటిని ఆహారంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందంటున్ారు. దీని ఆరోగ్యప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడంలో:
అధిక బరువు తగ్గాలనుకునేవారు కంద వంటకాల రుచి చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇందులో స్థూలకాయం, ఊబకాయం నిరోధక ప్రభావాలు ఇందులో ఉంటాయి. కందలోని ఫ్లేవనాయిడ్ సమ్మేళనం కూడా యాంటీ ఒబెసిటీ ప్రభావాన్ని కలిగి ఉంది. ఇది ఊబకాయం, అదనపు ఫ్యాట్ ను తగ్గించడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ దుంపలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ కూడా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందు అవకాశం ఉంటుంది.

షుగర్ కంట్రోల్లో :
షుగర్ వ్యాధితో బాధపడేవారు కంద దంపతో చేసిన వంటకాలు తింటే చాలా ఉపశమనం ఉంటుంది. ఇందులో అల్లాంటోయిన్ అనే రసాయన సమ్మేళనం సహజంగా ఉంటుంది. ఇది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. షుగర్ రోగుల్లో లిపిడ్ ప్రొఫైన్ ను మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఫైబర్ కంటెంట్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా షుగర్ రోగులకు కంద గడ్డ సూపర్ ఫుడ్ అని నిపుణులు అంటున్నారు.

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది :
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎలిమెంట్స్ కంద దుంపలో ఉన్నాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడానికి పనిచేస్తుంది.వివిధ శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, కంద దుంప మంట ప్రక్రియను తగ్గించడం ద్వారా పెద్దప్రేగు క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.

మనస్సుకు పదును పెడుతుంది :
కందదుంప తీసుకోవడం వల్ల మెదడు పదును పెడుతుంది. డయోస్జెనిన్ అనే మూలకం ఇందులో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డయోస్జెనిన్ అల్జీమర్స్ వ్యాధిని మెరుగుపరుస్తుంది.

విటమిన్ లోపాన్ని తగ్గిస్తుంది:
కంద దుంపలో మీ శరీరానికి అవసరమైన విటమిన్ల లోపాన్ని తీరుస్తుంది. విటమిన్ B6 గుండె జబ్బుల ప్రమాదాన్ని అలాగే చిరాకు, మంట, ఆందోళనను తగ్గిస్తుంది. శరీరంలో విటమిన్ B6 సరఫరా చేయడానికి కందదుంప తినవచ్చు. మీరు దానిని ఉడకబెట్టడం ద్వారా తినవచ్చు.

ఇది కూడా చదవండి: బురిడీ నారాయణ పరార్?.. దొంగ పాస్ పోర్ట్‎తో దుబాయ్ చెక్కేశాడా!

#health-tips #health-benefits-of-zimicand #jimicand
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe