West Bengal: రెండు రైళ్లు ఢీ.. ఐదుగురు మృతి..200 మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 200 మందికి గాయాలు అయినట్లు చెప్పారు.

West Bengal: రెండు రైళ్లు ఢీ.. ఐదుగురు మృతి..200 మందికి గాయాలు
New Update

Kanchenjunga Express train: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. 200 ,మందికి పైగా  ప్రయాణికులు గాయపడినట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది. ఈ విషయంపై సీఎం మమతా బనెర్జీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.


#kanchenjunga-express-train
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe