Sad News: అయ్యో అనిల్.. భార్య బరాత్‌లో డ్యాన్స్ వద్దన్నందుకు ఎంత పని చేశాడంటే?

బంధువుల వివాహ వేడుకలో భార్య డ్యాన్స్‌ చేయొద్దన్నందుకు భర్త మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకున్న ఘటన చిన్న ఆరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వృతిరిత్య కూలి అయిన అనిల్‌ను బారత్‌ వేడుకలో డ్యాన్స్‌ చేయవద్దని భార్య చెప్పడంతో అతను సూసైడ్ చేసుకున్నాడని సమాచారం.

Sad News: అయ్యో అనిల్.. భార్య బరాత్‌లో డ్యాన్స్ వద్దన్నందుకు ఎంత పని చేశాడంటే?
New Update

ఇటివలి కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. కోపం, ఆవేశం ఎన్ని అనర్థాలకు కారణమో ఆ ఆత్మహత్యలు చూస్తుంటే తెలుస్తుంది. తమని తాము చంపేసుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు అంతులేని వేదన మిగిల్చి వెళ్తున్నారు. కొంతమంది తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు పసివారిని చిన్నతనంలోనే అనాథలుగా మారుస్తోంది. తాజాగా కామారెడ్డి - నిజాంసాగర్ మండలంలో జరిగిన ఓ ఘటన గురించి వింటే అసలు మనుషుల ఆలోచనా తీరు మానసికంగా ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం అవుతుంది.


ఏం జరిగింది?
కామారెడ్డి - నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి తర్వాత బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయొద్దని భార్య అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు.

అనాథగా మారిన రెండేళ్ల పసివాడు:
అనిల్‌ రాత్రి 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక ఉదయం తండ్రి లచ్చయ్యకు ఒక చెట్టు దగ్గర ఎవరో వేలాడుతూ కనిపించారు. దగ్గరకు వెళ్లి చూడగా షాక్ అయ్యాడు. ఆ చెట్టుపై వేలాడుతోంది అనిలేనని గుర్తించిన తండ్రి ఈ విషయాన్ని పొలీసులకు, ఇంట్లో వారికి చెప్పాడు. చెట్టుపై నుంచి అనిల్ మృతదేహాన్ని కిందకు తీశారు. ఇక అక్కడ నుంచి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అనిల్‌కు 2ఏళ్ల కుమారుడు భార్గవ్‌ ఉన్నాడు. ఇలా రెండేళ్ల పసిబిడ్డను అన్యాయం చేశాడు అనిల్. అయితే అసలు కారణం బారత్‌లో డ్యాన్స్‌ గురించి భార్య మందలించడమే కారణామా లేదా వేరే ఇతర కారణం ఏదైనా ఉందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు, ప్రత్యేక హోదా

#suicide #kamareddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe