Bjp New strategy: ఎన్నికలకు ఇంకా కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో అధికార, ప్రతిపక్షాలు స్పీడ్ పెంచుతున్నాయి. తమ కొత్త స్ట్రాటజీలతో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్.. తొలి అభ్యర్థుల లిస్ట్ ను ప్రతిపక్షాల కంటే ముందే విడుదల చేయాలని, దీంతో రేస్ లో ముందజలో ఉన్నామన్న సంకేతాన్ని ఇవ్వాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా అభ్యర్థుల జాబితా పై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Bjp New strategy: తెలంగాణలో కమలం కొత్త స్ట్రాటజీ స్టార్ట్..వారం పాటు ఇక్కడే మకాం వేయనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మేల్యేలు!
ఈసారి ఎన్నికల ప్రచారానికి కమలనాథులు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.119 నియోజక వర్గాలకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున వారం రోజుల పాటు వారు ఇక్కడే ఉంటారు. ఎమ్మెల్యేలు..ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వారు అసెంబ్లీ స్థాయి కొర్ కమిటీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. వాల్ రైటింగ్ అభియాన్ లో పాల్గొంటారు. స్థానిక నేతలతో ఒక్కొక్కరీ తో వ్యక్తిగతంగా మాట్లాడుతారు..
Translate this News: