/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kamal-jpg.webp)
అమెరికా(America Vice president) వైస్ ప్రెసిడెంట్ భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్(kamala Harris) గురించి తెలియని వారు ఉండరు. ఆమె 2021 జనవరి 20 నుంచి అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఇటీవల వైట్ హౌస్ లో జరిగిన ఓ పార్టీలో ఆమె సరదాగా కాలు కదిపారు.
పాటలోని ట్యూన్స్ కు తగినట్లుగా ఆమె కాలు చేతులు కదుపుతూ డ్యాన్స్ చేశారు. వాటిని చూసిన నెటిజన్లు ఆమె పై విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్ లో హిప్ హాప్స్ 50 వ వార్షికోత్సవాన్ని ఆమె నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆమె సరదాగా కొన్ని పాటలకు స్టెప్పులేశారు.
ఆ వేడుకకు ఆమె రంగు రంగుల షర్ట్ వేసుకుని గులాబీ రంగు ప్యాంట్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ఆంథోని బ్రియాన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దానిని చూసినవారందరూ కూడా..ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ‘ఆ డ్యాన్స్‌ను చూడలేకపోతున్నాం’, ‘ఆమె అచ్చం భామ్మలా డ్యాన్స్ చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kamala Harris with the granny 👵🏼 moves at her 50th Anniversary of Hip-Hop partypic.twitter.com/8Lg5XCxQ3a
— Anthony Brian Logan (ABL) 🇺🇸 (@ANTHONYBLOGAN) September 9, 2023