ప్రముఖ హీరో కమల్‌హాసన్‌కు షాకిచ్చిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది..!

ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. దానికి సీక్వెల్‌గా భారతీయుడు-2 మూవీ రానుంది. దీనికోసం ఏయిర్‌పోర్టులో సెట్ వేశారు. అయితే పర్మిషన్ లేకుండా సెట్ వేయకూడదని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మూవీ షూట్ ఆగిపోయింది.

ప్రముఖ హీరో కమల్‌హాసన్‌కు షాకిచ్చిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది..!
New Update

kamal-haasans-indian-2-shoot-at-the-chennai-airport-stopped-midway

అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇండియన్‌-2. శంకర్‌ డైరెక్షన్‌, కమల్‌ నటన అప్పట్లో ఓ సునామీని క్రియేట్ చేసింది. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్‌ యథావిధిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతుంది. కాగా విమానాశ్రయంలో ఓ భారీ సీన్‌ చిత్రీకరిస్తుండగా ఏయిర్‌పోర్ట్‌ నిర్వాహకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారట. ఇక చిత్ర బృందం ఏయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు, డిపార్చర్‌ ఏరియాలో షూటింగ్‌ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ పొందింది. కానీ లావటరీ ఏరియాలో షూటింగ్‌కు పర్మిషన్‌ లభించలేదు. అదేం పట్టించుకోకుండా అక్కడ షూటింగ్‌ చేయడంతో ఏయిర్‌పోర్ట్‌ నిర్వాహకులు అడ్డుకున్నారు. కాగా డిపార్చర్‌ ఏరియాలో పర్మిషన్‌ కోసం చిత్రబృందం ఏకంగా కోటి ఇరవై నాలుగు లక్షలు చెల్లించిందట.

సంక్రాంతి పండుగ రోజున తీసుకురావాలని శరవేగంగా టాకీ పార్ట్‌ను పూర్తి చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కమల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్ధార్థ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ కంపోజ్‌ చేస్తున్నాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe