భారీ ధర పలికిన సీక్వెల్ భారతీయుడు... డిజిటల్ రైట్స్ ఎంతో తెలుసా...! భారీచిత్రాల దర్శకుడు శంకర్, నటవిరాట్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు. కమల్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెచ్చించారు. 1996 లో విడుదై సంచలనం సృష్టిచింది. సేమ్ కాంబినేషన్ తో సీక్వెల్ గా వస్తున్న చిత్రం భారతీయుడు-2. ఇండియన్ సీక్వెల్ డిజిటల్ రైట్స్ రూ.200 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. By V. Sai Krishna 24 Jul 2023 in సినిమా New Update షేర్ చేయండి భారీచిత్రాల దర్శకుడు శంకర్, నటవిరాట్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు. కమల్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెచ్చించారు. 1996 లో విడుదై సంచలనం సృష్టిచింది. సేమ్ కాంబినేషన్ తో సీక్వెల్ గా వస్తున్న చిత్రం భారతీయుడు-2. ఇండియన్ సీక్వెల్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల ఎప్పటికప్పుడు భారతీయుడికి బ్రేక్ లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు శంకర్..హీరో రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకే సారి పూర్తి చేస్తున్నాడు శంకర్. ఇక ఇండియన్ 2 కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ ధరకు జరుగుతుందని టాక్. తాజాగా ఇండియన్ 2 డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ 2 మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి