Devil OTT Release: అభిషేక్ నామ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన లేటెస్ట్ చిత్రం డెవిల్. పీరియాడిక్ యాక్షన్ త్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగా నటించింది.
డెవిల్ ఓటీటీ రిలీజ్
డిసెంబర్ 29 న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా విడుదలైన 16 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. డెవిల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) దక్కించుకుంది. ఇక తాజాగా ఈ సంస్థ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటన ఇచ్చింది. జనవరి 14 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ భాషలతో పాటు దాదాపు 240 దేశాలల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయవచ్చని తెలుస్తోంది. ముందుగా తెలుగు, తమిళ్ వెర్షన్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత మిగతా ల్యాంగ్వేజెస్ లో కూడా అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. డెవిల్ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. ఈ సినిమాలో మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొనెన్‍బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్.. మేకింగ్ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్!
డెవిల్ స్టోరీ
బ్రిటీష్ పాలనలో రసపాడు అనే ప్రాంతంలో జమిందార్ కూతురు అనుమానాస్పద హత్యకు గురవుతుంది. ఈ హత్యకు సంబంధించిన మిస్టరీని చేధించడానికి బ్రిటీష్ పాలకులు.. సీక్రెట్ ఏజెంట్ అయిన కళ్యాణ్ రామ్ (హీరో) కు బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసును విచారించే క్రమంలోనే 'ఆపరేషన్ టైగర్ హంట్' అని మరో మిషన్ కళ్యాణ్ రామ్ కు అప్పగిస్తుంది బ్రిటీష్ ప్రభుత్వం. అసలు జమిందారు కూతురిని హత్యకు కారణమెవరు..? ఆపరేషన్ టైగర్ హంట్ మిషన్ కు హత్యకు ఏదైనా సంబంధం ఉందా..? అనే విషయాల ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది.