Folk Singer Jayaraj: ప్రముఖ పాటల రచయిత, ఫోక్ సింగర్ జయరాజ్‌కు 'కాళోజీ' అవార్డు..

పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘కాళోజీ నారాయణ రావు అవార్డు’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది.

New Update
Folk Singer Jayaraj: ప్రముఖ పాటల రచయిత, ఫోక్ సింగర్ జయరాజ్‌కు 'కాళోజీ' అవార్డు..

Kaloji Narayana Award to Folk Singer Jayaraj: పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు(Kaloji Narayana Rao) పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘కాళోజీ నారాయణ రావు అవార్డు’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్(Jayaraj) కు దక్కింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR).. కవి జయరాజ్ ను ఎంపిక చేశారు. ఈ నెల 9 వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో జయరాజ్ కు ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డులో భాగంగా జయరాజ్ కు రూ. 1,01,116 నగదు రివార్డు, జ్జాపికను అందిస్తారు. ఆయనను సత్కరిస్తారు.

జయరాజ్ నేపథ్యం ఇదీ..

నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా, నేటి మహబూబాబాద్ జిల్లా కు చెందిన జయరాజ్ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుధ్దుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్పూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ.. తన ఆట పాట గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవిగా జయరాజు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.

Also Read:

PM Narendra Modi: ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

Bangladeshi Vlogger: బెంగుళూరు ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయిన బంగ్లాదేశ్‌ లవ్‌బర్డ్స్‌

Advertisment
తాజా కథనాలు