Kalki 2898 AD: అమితాబ్ 55 ఏళ్ల నట జీవితంలో సాధించలేనిది కల్కి ఇచ్చింది! ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణం నుంచి రిలీజ్ దాకా అన్నీ సంచలనాలే. హై బడ్జెట్, ఎలక్ట్రిఫైయింగ్ స్టారింగ్..పాన్ వరల్డ్ సినిమాగా వచ్చింది కల్కి. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ కీలక రోల్ లో కనిపించారు. ఆయన 55 ఏళ్ల సినీజీవితంలో సాధించలేని రికార్డులు కల్కి సినిమా తెచ్చి పెట్టింది. By KVD Varma 11 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. 14వ రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్లు రాబట్టింది. దీని ద్వారా ఇండియాలో 536.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వారం రోజులు కావడంతో సినిమా వసూళ్లు బాగా తగ్గాయి. వీకెండ్‌కి సినిమా కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. 'కల్కి 2898 AD' తెలుగు సినిమా. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. హిందీ వారికి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. దీనికి కారణం అమితాబ్ బచ్చన్ పాత్ర. చివర్లోనే ప్రభాస్ (Prabhas) క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది. అప్పటి వరకు అమితాబ్ కేంద్రంగా సినిమా నడుస్తుంది. అందుకే హిందీ వాళ్లకు సినిమా బాగా నచ్చింది. రూ.500+ కోట్లలో హిందీ రూ.229.05 కోట్లు, తెలుగులో రూ.252 కోట్లు రాబట్టింది కల్కి సినిమా. దీంతో హిందీలో సినిమాకు మరింత డిమాండ్ ఏర్పడింది. Also Read: తమన్నాతో నా బంధం అలాంటిదే..విజయ్ వర్మ! ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు రాబట్టినట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' చిత్రాన్ని అధిగమించింది. ఈ చిత్రం 915 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 'కల్కి 2898 ఏడీ' సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకుపోతోంది. దాదాపుగా ఐదున్నర దశాబ్దాలుగా సూపర్ హీరోగా అమితాబ్ హిందీలో నటిస్తూ వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ (v) ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఇప్పటి వరకూ ఆయన సినిమాలేవీ ఇంత భారీ వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఆయన కెరీర్ లోనే భారీ విజయం సాధించడం ఇదే తొలిసారి. అశ్వత్థామగా అమితాబ్ ప్రేక్షకులను మాయలో ముంచేశారని చెప్పవచ్చు. హిందీ బెల్ట్ లో కల్కి సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టింది అమితాబ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎవరూ కాదనలేని నిజం. కల్కి ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు: #amitabh-bachchan #kalki-2898-ad-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి