Kalki 2898 AD Records: కల్కి సినిమా ఐదు అరుదైన రికార్డులు.. అమితాబ్ కెరీర్ లోనే అద్భుతం!

ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ  కల్కి 2898 AD అరుదైన రికార్డులు సృష్టిస్తోంది. టాప్ 3 హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల సినిమాల్లో ప్రభాస్ రెండో సినిమా ఇది. అమితాబ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా కల్కి. దీపికా పదుకొణె కూ ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్ సినిమా. 

Kalki 2898 AD Records: కల్కి సినిమా ఐదు అరుదైన రికార్డులు.. అమితాబ్ కెరీర్ లోనే అద్భుతం!
New Update

Kalki 2898 AD Records:  ప్రస్తుతం ప్రపంచ సినిమాలో ఎక్కడ చూసిన కల్కి 2898 ADకి సంబంధించిన విశేషాలే చర్చలో ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన సృష్టికి ప్రపంచ సినిమా జేజేలు కొడుతోంది. ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన దండయాత్రను మొదలు పెట్టాడు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. వైజయంతీ మూవీస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల ఊచకోత కొస్తోంది. ఈ చిత్రంలో సౌత్ సినిమా.. ప్రభాస్.. కమల్ హాసన్ నటించగా, బాలీవుడ్ నుండి దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కనిపించారు.  దిశా పటాని కూడా అతిధి పాత్రలో కనిపించింది. కల్కి సినిమా  బలమైన స్టార్ కాస్ట్ నుండి ప్రయోజనం పొందింది మరియు విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 191.5 కోట్లు సంపాదించింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులను తన పేరు మీద రాసేసింది. ఈ సినిమా సృష్టించిన ఐదు పెద్ద రికార్డుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

2024 సంవత్సరంలో అతిపెద్ద సినిమా..
Kalki 2898 AD Records:  'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ పరంగా 2024 సంవత్సరంలో అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది 'ఫైటర్‌', 'షైతాన్‌', 'బడే మియాన్‌ ఛోటే మియాన్‌' వంటి అనేక చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా మొదటి రోజు ఇంత కలెక్షన్స్ సాధించలేకపోయాయి. 

Kalki 2898 Records

ఇండియన్ సినిమాకి మూడో పెద్ద ఓపెనర్
Kalki 2898 AD Records:  ఇంత గొప్ప వసూళ్లతో, 'కల్కి 2898 AD' భారతీయ సినిమా మూడవ అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. మొదటి స్థానంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల 'RRR' మొదటి రోజు 223 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. 217 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టిన ప్రభాస్ 'బాహుబలి 2' రెండవ స్థానంలో ఉంది.

Kalki Records

ప్రభాస్ కెరీర్‌లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్
Kalki 2898 AD Records:  2017లో విడుదలైన ప్రభాస్ 'బాహుబలి 2' తొలిరోజు రూ.217 కోట్లు రాబట్టిందని మనం పైన చెప్పుకున్నాం. దాంతో పాటు ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా 'బాహుబలి 2' నిలిచింది. ఇప్పుడు  'కల్కి 2898 AD' అతని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది.

publive-image

అమితాబ్ బిగ్గెస్ట్ ఓపెనర్
Kalki 2898 AD Records:  అమితాబ్ బచ్చన్ దాదాపు 55 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. 1969లో 'సాత్ హిందుస్తానీ' సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఏ సినిమా కూడా మొదటి రోజు 'కల్కి 2898 AD' సాధించినంత వసూళ్లు సాధించలేదు.

publive-image

దీపికా పదుకొణెకు కూడా..
అమితాబ్ బచ్చన్‌తో పాటు, దీపికా పదుకొణెకు కూడా ఇదే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందు దీపిక తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం 'జవాన్', తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.129 కోట్లు వసూలు చేసింది.

మొత్తంగా చూసుకుంటే.. సినిమా మొదటి రోజే రికార్డులు బ్రేక్ చేసింది.. కొత్త రికార్డులు సృష్టించింది. ఇక సినిమాకు ఫుల్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ప్రభంజనం మరింత కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో.. కల్కి సినిమాకి తిరుగు ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

#kalki-2998-ad #tollywood
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి