Kalki 2898 AD Records: ప్రస్తుతం ప్రపంచ సినిమాలో ఎక్కడ చూసిన కల్కి 2898 ADకి సంబంధించిన విశేషాలే చర్చలో ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన సృష్టికి ప్రపంచ సినిమా జేజేలు కొడుతోంది. ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన దండయాత్రను మొదలు పెట్టాడు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల ఊచకోత కొస్తోంది. ఈ చిత్రంలో సౌత్ సినిమా.. ప్రభాస్.. కమల్ హాసన్ నటించగా, బాలీవుడ్ నుండి దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కనిపించారు. దిశా పటాని కూడా అతిధి పాత్రలో కనిపించింది. కల్కి సినిమా బలమైన స్టార్ కాస్ట్ నుండి ప్రయోజనం పొందింది మరియు విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 191.5 కోట్లు సంపాదించింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులను తన పేరు మీద రాసేసింది. ఈ సినిమా సృష్టించిన ఐదు పెద్ద రికార్డుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD Records: కల్కి సినిమా ఐదు అరుదైన రికార్డులు.. అమితాబ్ కెరీర్ లోనే అద్భుతం!
ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD అరుదైన రికార్డులు సృష్టిస్తోంది. టాప్ 3 హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల సినిమాల్లో ప్రభాస్ రెండో సినిమా ఇది. అమితాబ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా కల్కి. దీపికా పదుకొణె కూ ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్ సినిమా.
Translate this News: