వారాహి యాత్ర రూట్‌కి లైన్ క్లియర్.. జోష్‌లో జనసైనికులు.... By Shareef Pasha 13 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి, పార్టీ నేతలకి తీపికబురు అందించింది.జనసేన పార్టీ... జనసేనాధి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయింది. దీంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కొన్నిరోజుల క్రితం ఉత్కంఠ నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు పోలీసుల నుంచి వారాహి యాత్రకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. డీఎస్పీలు ఎక్కడికక్కడ టచ్‌లోనే ఉంటారని.. పవన్ పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా.. తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. జనసైనికులు ఎలాంటి అవాంతరాలకు దారి తీయకుండా, సజావుగా వారాహి యాత్రను జరుపుకోవాలని సూచించారు. పోలీసులు సానుకూలంగా స్పందించి, యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ తెలిపారు. జనసైనికులు హడావుడి చేయకుండా, సజావుగా సభ నిర్వహించేలా సహకరించాలని పోలీసులు కోరారు. క్రేన్‌ల ద్వారా భారీ పూలమాల వేసే ప్రక్రియ లాంటివి లేకుండా, ప్రశాంతంగా యాత్ర చేసుకోవాలని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా రాష్ట్ర, జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశామన్నారు. జూన్ 13 బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారని.. రేపు ( జూన్ 14) ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేసి, అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారని అనంతరం కత్తిపూడిలో సభ నిర్వహిస్తారని స్పష్టం చేశారు. దానికనుగుణంగానే కత్తిపూడిలో మొదటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ సభ జూన్ 23 వరకు జరగనుందని చివరగా నరసాపురంలో వారాహి యాత్ర జరగనుందని దీనికనుగుణంగా యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన పార్టీ కార్యకర్తలందరు సహకరించాలని కోరారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి