ఓ హైస్కూల్లో విద్యార్థుల జడలు కత్తిరించిన సోషల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వెంట్రుకలు కత్తిరించడంతో అవమానంతో విద్యార్థులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లారు. జడ వేసుకునే విధానంపై తరచూ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీచర్ ఈ రోజు జడ కత్తించారు. స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ నిర్వహణ నిర్వాకం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
This browser does not support the video element.
కాకినాడ జిల్లాలో తిలక్ స్ట్రీట్ శారద మున్సిపల్ హైస్కూల్లో టీచర్ నిర్వాకం. తొమ్మిదో తరగతి విద్యార్థుల జడలు కత్తిరించిన సోషల్ టీచర్ మంగతాయారు. ఒక జడ, రెండు జడలు ఎదరకు వేసుకుని స్కూలుకు వచ్చారని కోపంతో ఎనిమిది మంది విద్యార్థినిల జడలు కత్తిరించి ఇంటికి పంపిన టీచర్. టీచర్ నిర్వాకంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా ఎందుకు చేశారంటూ నిలదీశారు. పిల్లలు అవమానంతో ఇంటి నుంచి బయటకు రావడం లేదంటూ ఓ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. స్కూల్ వద్దకు విద్యార్థులు తల్లిదండ్రులు చేరుకున్న ఆందోళన చేశారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
This browser does not support the video element.
ఇక ఈ విషయంపై విద్యార్థుల తల్లింద్రడులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు స్కూల్‌కు వెళ్ళమంటూ తెగేసి చెబుతున్నారని వారు వాపోయ్యారు. జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతున్నామని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు మాట్లాడుతూ.. భయం చెప్పాలని చెప్పాం కానీ.. మరి ఇంతలాగా చేయకూడదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళమని తాగేసి చెప్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంకా మా పిల్లలు ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని..? వారు ప్రశ్నిస్తున్నారు.
This browser does not support the video element.
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చారు. ఏం జరిగిందనేది..? వాళ్ళు వివరించారు. వెంటనే స్కూల్ హెడ్‌మాస్టర్‌తో మాట్లాడి.. పిల్లల దగ్గరకు వెళ్ళారు. అక్కడ జరిగిన విషయం పిల్లలు ఉన్నాధికారులకు వివరించారు. కత్తిరించి జడను చూపించారు. పిల్లలపై ఇలాంటి భౌతిక చర్యలు తీసుకోకూడదని చట్టం చెప్తుందని వారు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జుట్టు కత్తిరించటం అనేది చాలా దారుణం అన్నారు. దీనిని డిపార్ట్‌మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. టీచర్‌పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్‌ని సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
This browser does not support the video element.