Kakani Govardhan Reddy: వైసీపీ వారికి పెన్షన్ లు ఇవ్వడం లేదు.. మాజీ మంత్రి కాకాణి ఫైర్

ఏపీలో సచివాలయం వ్యవస్థను స్థాపించింది జగన్ అని అన్నారు మాజీ మంత్రి కాకాణి. బాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతుందని.. వైసీపీ వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అందరికి పెన్షన్లు అందాయని అన్నారు.

New Update
AP: అందుకే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి

Pensions: ఏపీలో కొత్తగా ఏర్పడిన టీడీపీ (TDP) ప్రభుత్వం పెంచిన పెన్షన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తాం అని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అన్నారు. సచివాలయం వ్యవస్థను స్థాపించింది జగన్ అని చెప్పారు. పెన్షన్ లు సచివాలయం ఉద్యోగుల చేత పంపిణీ చేయించి తిరిగి జగన్ పై విమర్శలు చేయడం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు.

Also Read: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం!

పేదలకు పెన్షన్ లు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలని అలోచన చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పెన్షన్ తీసుకోవడానికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారో... అందరికీ తెలుసు అని అన్నారు. వైసీపీ వారికి పెన్షన్ లు ఇవ్వడం లేదు..ఇది దుర్మార్గపు ఆలోచన అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు