AP: సర్వేపల్లిలో సోమిరెడ్డి భారీ అవినీతి!

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 3 లక్షలు డిమాండ్ చేశారన్నారు. తాను నిజాయితీపరుడినని సోమిరెడ్డి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

New Update
AP: సర్వేపల్లిలో సోమిరెడ్డి భారీ అవినీతి!

Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు చంద్రమోహన్ రెడ్డి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారన్నారు.

పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని.. ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు తనపై A2 గా కేసు పెట్టారని తెలిపారు. అయితే, పోలీసు కేసులకు తాము భయపడమన్నారు. తాను నిజాయితీపరుడినని సోమిరెడ్డి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా? సోమిరెడ్డిపై ఇతరులు చేసిన ఆరోపణలను ఫార్వర్డ్ చేయడం తప్పా? అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం.. అధికారంలో లేనప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డి నైజం అన్నారు.

Also Read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే!

గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అంగన్వాడి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు
ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ జెన్కో కు చెందిన విద్యుత్ ప్లాంట్ బూడిదకు సంబంధించిన బల్కర్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని.. సర్వేపల్లి నియోజకవర్గంలో లేవుట్ యజమానుల నుంచి మామూళ్ళు తీసుకున్నారని కాకాణి అన్నారు.

అప్పట్లో వాళ్లందరూ నా బినామీలు అన్నారని.. లేఔటీ లన్నీ ధ్వంసం చేశారని.. ఇప్పుడు డబ్బులు తీసుకొని.. వాటికి అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇప్పుడు తమను ఏమీ చేయలేక కేసులు పెడుతున్నారన్నారు. సోమిరెడ్డి చేసే అవినీతి పనులకు సంబంధించి ఒక రికార్డును విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్ పనులను పరిశీలించడం, కాంటాక్టర్లను బెదిరించి..మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటేనన్నారు.

ఎస్.ఎన్.జె.డిస్టీలరీస్ నుంచి తాను మామూళ్లు తీసుకున్నానని సోమిరెడ్డి ఆరోపించారని..దమ్ముంటే దానిని నిరూపించాలన్నారు. సోమిరెడ్డి లాంటి అవినీతి బతుకు బతికే వాళ్ళు రాష్ట్రంలో అరుదుగా ఉంటారని ఫైర్ అయ్యారు. ఇసుక..గ్రావెల్..మట్టిని అక్రమ రవాణా చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చెప్పిన అంశాలపై విచారణ చేస్తే ఎవరు దోషి అనే విషయం తేలుతుందన్నారు.

Advertisment
తాజా కథనాలు