ఫ్యాన్స్‌కి ఆసక్తికర విషయాలు చెప్పిన నటి కాజల్!

నటీ కాజల్ ఆసక్తికర విషయాలు చెప్పింది. లక్ష్మీకళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కాజల్, మొదటి సినిమాతోనే తెలుగమ్మాయిలా కనిపించి ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. తల్లి అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది. అయితే తన కొడుకును హైదరాబాద్‌కు తీసుకొస్తానని కాజల్ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ఫ్యాన్స్‌కి ఆసక్తికర విషయాలు చెప్పిన నటి కాజల్!
New Update

kajal+aggarwal+na+kodukunu+tappakunda+tisukosta+aasaktikara+vyaakhyalu+chesina+kaajal

హీరోయిన్ కాజల్ తేజ దర్శకత్వంలో టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ భామకు చందమామ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర తో స్టార్‌డమ్ తెచ్చుకుంది. మగధీర భారీ విజయం సాధించడంతో కాజల్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కిందుకుంది. అలాగే సీనియర్ హీరోలతోను నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్ళాడి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది.

కాజల్ రీ-ఎంట్రీ

పెళ్లి తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. తెలుగులో కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ చేస్తుంది. ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ నుంచి కాజల్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

నా కొడుకును హైదరాబాద్‌కు తీసుకొస్తా

తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ..మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం తెలుగు ప్రేక్షకులు అని తెలిపింది. సత్యభామగా ఈసారి మీ ముందుకు రాబోతున్నా. ఇప్పటి వరకు నేను చేయని పాత్ర ఇది. తప్పకుండా మీకు నచ్చుతుంది. నేను ఎక్కడికి వెళ్లిన నా కొడుకు నీల్ ను తీసుకువెళ్తుంటా.. కానీ.. ఈసారి నేను నా బిడ్డను తీసుకురాలేదు. సత్యభామ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు నా కొడుకును హైదరాబాద్‌కు తీసుకొస్తా.. అని తెలిపింది. ఇక.. కాజల్ భగవంత్ కేసరిలో సినిమాలో నటసింహం బాలకృష్ణ సరసన నటిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe